Monkeypox: వైద్యరంగలో భారత్ మరో ముందడుగు.. మంకీపాక్స్ వైరస్ నిర్ధరణకు టెస్టింగ్ కిట్ తయారీ

ప్రపంచ దేశాలను మంకీపాక్స్(Monkeypox) వైరస్ కలవర పెడుతోంది. కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో మంకీపాక్స్ విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా ఈ వైరస్ గురించి...

Monkeypox: వైద్యరంగలో భారత్ మరో ముందడుగు.. మంకీపాక్స్ వైరస్ నిర్ధరణకు టెస్టింగ్ కిట్ తయారీ
Monkeypox
Follow us

|

Updated on: May 28, 2022 | 9:10 PM

ప్రపంచ దేశాలను మంకీపాక్స్(Monkeypox) వైరస్ కలవర పెడుతోంది. కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో మంకీపాక్స్ విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా ఈ వైరస్ గురించి శాస్త్రవేత్తలు ముమ్మర పరిశోధనలు ప్రారంభించారు. ఇండియాకు చెందిన మెడికల్‌ పరికరాల తయారీ సంస్థ ట్రివిట్రాన్‌(Trivitron) హెల్త్‌కేర్‌.. మంకీపాక్స్‌ను గుర్తించేందుకు ఓ రియల్‌టైమ్ పీసీఆర్‌ కిట్‌ను రూపొందించింది. ఇది నాలుగు రంగుల ఫ్లోరోసెన్స్‌ ఆధారిత కిట్‌. ఇది వన్‌ ట్యూబ్‌ సింగిల్‌ రియాక్షన్‌ ఫార్మాట్‌లో పని చేస్తుంది. తద్వారా గంటలోపే ఫలితం తెలుసుకోవచ్చని ట్రివిట్రాన్‌ వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో మంకీ పాక్స్ వైరస్‌ వ్యాప్తి కట్టడికి తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ట్రివిట్రాన్ హెచ్చరించింది. 20 దేశాల్లో మంకీపాక్స్‌ కేసులు వెలుగుచూశాయి. వ్యాధి వ్యాప్తిని అరికట్టకపోతే ఇతరులకు సోకే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మశూచికి వాడే టీకాలు మంకీపాక్స్‌పై పనిచేస్తున్నాయా? లేదా? అన్న విషయంపై బ్రిటన్‌, జర్మనీ, కెనడా, అమెరికాలు పరిశోధన ప్రారంభించాయి.

మరోవైపు.. వేగంగా వ్యాప్తి చెందుతున్న మంకీపాక్స్(Monkeypox) వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక ప్రకటన చేసింది. కరోనా కేసులు తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తున్న మంకీపాక్స్‌ వైరస్‌ కరోనా అంత ప్రమాదకారి కాదని వెల్లడించింది. ఈ వైరస్‌ ను నివారించేందుకు అవసరమైన టీకాలు ఏయే దేశాల వద్ద ఎన్ని ఉన్నాయో పూర్తి సమాచారం లేదని తెలిపింది. ప్రస్తుతం 20 దేశాల్లో మంకీపాక్స్‌ కేసులు బయటపడ్డాయి. పశ్చిమ ఆఫ్రికా బయట తొలిసారిగా ఈ వైరస్ ను గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది.

తొమ్మిది ఆఫ్రికన్ దేశాల్లో(African Countries) మంకీపాక్స్‌ వ్యాప్తిని గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ వివరించింది. వైరస్ వ్యాప్తిపై దృష్టి సారిస్తే నివారించడం అంత కష్టమేమీ కాదని పేర్కొంది. సరైన చర్యలు తీసుకుంటే మంకీపాక్స్‌ను సులువుగా కట్టడి చేయవచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుతం వైరస్‌ సోకినవారి క్లోజ్‌ కాంటాక్ట్‌లకు సరిపడే టీకాలు అందుబాటులో ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి