Permanent smile: నవ్వులోలికే చిన్నారి ముఖం వెనుక నమ్మలేని నిజం.. ఇదో అరుదైన వ్యాధి!
పుట్టుకతోనే వచ్చే అరుదైన వైకల్యంతో జన్మించిన ఓ పాప ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ చిన్నారి ఫోటో చూసిన నెటిజన్లు ఎంత అందమైన నవ్వు తల్లి అంటూ మనసుకు హత్తుకుంటున్నారు. ఇంత అందమైన చిన్నారికి
పుట్టుకతోనే వచ్చే అరుదైన వైకల్యంతో జన్మించిన ఓ పాప ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ చిన్నారి ఫోటో చూసిన నెటిజన్లు ఎంత అందమైన నవ్వు తల్లి అంటూ మనసుకు హత్తుకుంటున్నారు. ఇంత అందమైన చిన్నారికి అరుదైన వైకల్యం ఏంటని సందేహంతో కూడిన కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఆ చిన్నారి నవ్వు వెనుక నమ్మలేని నిజం ఏంటన్నది ఇక్కడ చర్చనీయాంశం..పూర్తి వివరాలు పరిశీలించగా,…
డిసెంబరు 2021లో జన్మించింది… ఐలా సమ్మర్ ముచా అనే ఈ బోసినవ్వుల చిన్నారి. అయితే పుట్టినప్పుడు ఈ చిన్నారి ఏడవలేదట. పైగా పెదాల దగ్గర అసాధారణ స్థితి కనిపించటంతో ఆ తల్లిదండ్రులు కంగారుపడిపోయారు. పసికందును పరిక్షించిన వైద్యులు…అది బైలెటరల్ మాక్రోస్టోమియాగా నిర్ధారించారు. ఇదేంటీ..ఇదేదో విచిత్రమైన పేరు చెబుతున్నారు అని కదా సందేహం..బైలెటరల్ మాక్రోస్టోమియా అంటే..పసి పాప నోటి కుహరం వెడల్పుగా ఉండే అతి-అరుదైన పరిస్థితిని ఎదుర్కుంటోంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే చిన్నారి ఈ వ్యాధి బారినపడినట్టు వైద్యులు తెలిపారు. దీని వల్ల పాప ముఖంలో ఎప్పుడూ చిరునవ్వుతో ఉన్నట్లే కనిపిస్తుంది. అయితే, చిన్నారి తల్లిదండ్రులకు పాపకు సర్జరీ చేయించాలనుకుంటున్నారు. ఇకపోతే, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు 14 మాత్రమే ఉన్నాయని వైద్యాధికారులు వెల్లడించారు.. కానీ, ఐలాను గర్భంలో ఉన్నప్పుడు పరీక్షించిన ఫ్లిండర్స్ మెడికల్ సెంటర్‌లోని వైద్యులు ఇది వాళ్లకు మొదటిసారి కనిపించిందని పేర్కొన్నారు.
మొత్తానికి సోషల్ మీడియాలో మాత్రం చిన్నారి స్మైల్ హల్‌చల్ చేస్తోంది. పాప బోసినవ్వుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నిజం తెలిసి, ఒకింత షాక్ అవుతున్నారు. మనిషికి ఏడుపు శాపం,..కానీ, ఈ చిన్నారికి ఎప్పుడూ నవ్వుతూనే ఉండే వరాన్ని ప్రసాదించాడు దేవుడు అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.