పాకిస్తాన్‌ సేనలను తుత్తునియలు చేద్దామనుకున్నాం ః ధనోవా

పుల్వామా ఉగ్రదాడి.. అందుకు జవాబుగా బాలకోట్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దాడులు... ఆ సమయంలో భారత-పాకిస్తాన్‌ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి.. ఏ నిమిషంలోనైనా యుద్ధం రావచ్చన్న

పాకిస్తాన్‌ సేనలను తుత్తునియలు చేద్దామనుకున్నాం ః ధనోవా
Follow us

|

Updated on: Oct 30, 2020 | 11:05 AM

పుల్వామా ఉగ్రదాడి.. అందుకు జవాబుగా బాలకోట్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దాడులు… ఆ సమయంలో భారత-పాకిస్తాన్‌ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి.. ఏ నిమిషంలోనైనా యుద్ధం రావచ్చన్న వాతావరణం అప్పుడు ఉండింది.. భారత వైమానిక దాడుల తర్వాత పాకిస్తాన్‌ సైలెంటయ్యింది కానీ ఏ మాత్రం నోరుజారినా, అడుగు ముందుకేసినా పాక్‌ ఘోరంగా దెబ్బతినేది.. ఈ మాట అంటున్నది అప్పటి ఇండియన్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బి.ఎస్‌.ధనోవా..పాకిస్తాన్‌ చిన్నపాటి ప్రతిస్పందన కనబర్చినా ఆ దేశపు సైనిక విభాగాలను తుడిచిపెట్టేద్దామనుకున్నామని చెప్పారు.. అందుకోసం భారత సైన్యం కూడా సంసిద్ధమయ్యిందన్నారు. ఆనాటి వైమానిక దాడుల్లో పాకిస్తాన్‌ భూభాగంలో దిగి ఆ దేశానికి చిక్కిన ఐఎఎఫ్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ అప్పగింతకు ముందు ఆ దేశ నాయకులు గజగజ వణికిపోయారని వచ్చిన వార్తలు నిజమేనన్నారు ధనోవా. అభినందన్‌ను అప్పగించడం మినహా పాక్‌కు వేరే దారి లేదన్నారు. దౌత్యపరంగా పాకిస్తాన్‌పై విపరీతమైన ఒత్తిడి ఉండిందని, అక్కడి రాజకీయపక్షాలు కూడా భారత్‌తో తగువు పెట్టుకోవడం ఎందుకనే ఉద్దేశంతో ఉన్నాయని వివరించారు. భారత్‌తో పెట్టుకుంటే ఏమవుతుందో పాకిస్తాన్‌కు తెలియనిది కాదు కాబట్టే భారత బలగాల సామర్థ్యం పాక్‌ నాయకులను వణికించిందని ధనోవా అన్నారు.

ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ఎన్నికల తర్వాత రీచార్జ్ చార్జీల బాదుడు..?
ఎన్నికల తర్వాత రీచార్జ్ చార్జీల బాదుడు..?
ఊరికే గ్రేట్ డైరెక్టర్ అవ్వరు మరి..!
ఊరికే గ్రేట్ డైరెక్టర్ అవ్వరు మరి..!
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా