Tamil Nadu Politics: ఎవ్వరినీ వదిలిపెట్టను.. ఆ నేతలకు శశికళ స్ట్రాంగ్ వార్నింగ్.. హీటెక్కిన పాలిటిక్స్..!

Tamil Nadu Politics: తాను ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టకుడా ఉండేందుకు పార్టీ రాజ్యాంగాన్ని మార్చినంత మాత్రాన జరిగేదేమీ లేదని అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు

Tamil Nadu Politics: ఎవ్వరినీ వదిలిపెట్టను.. ఆ నేతలకు శశికళ స్ట్రాంగ్ వార్నింగ్.. హీటెక్కిన పాలిటిక్స్..!
Vk Sasikala
Follow us

|

Updated on: Dec 03, 2021 | 5:46 AM

Tamil Nadu Politics: తాను ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టకుడా ఉండేందుకు పార్టీ రాజ్యాంగాన్ని మార్చినంత మాత్రాన జరిగేదేమీ లేదని అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ అన్నారు. త్వరలోనే అందరికీ సమాధానం చెబుతానని అన్నారు. తనను అడ్డుకోలేరని, మీరెవరూ భయపడవద్దంటూ అన్నాడీఎంకే కార్యకర్తలకు భరోసా ఇచ్చారు చిన్నమ్మ శశికళ.

వివరాల్లోకెళితే.. అన్నాడీఎంకే రాజ్యాంగాన్ని మార్చడంపై స్పందించారు చిన్నమ్మ శశికళ. తాను పార్టీ జనరల్‌ సెక్రటరీ పదవిని చేపట్టకుండా మార్పులు చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని మార్చడంతో పార్టీకి పునర్‌ వైభవం రావడం కష్టమన్నారు. అయిననప్పటికీ కార్యకర్తలు నిరాశ చెందవద్దని, తాను అండగా ఉంటానని అభయమిచ్చారు. తనను వ్యతిరేకించే వారికి చిన్నమ్మ గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. తానెవరికి భయపడటం లేదని, మీరూ భయపడొద్దు అని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. త్వరలోనే అందరికీ సమాధానం చెబుతానని శశికళ వ్యాఖ్యానించారు. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు శశికళ. అన్నాడీఎంకేకి పూర్వ వైభవం తెస్తానని ప్రకటించారు.

కాగా, చిన్నమ్మ ఎంట్రీని శాశ్వతంగా అడ్డుకునేలా అన్నాడీఎంకే రాజ్యాంగాన్ని మర్చేసింది పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం ద్వయం. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రీసిడియం ఛైర్మన్‌గా తమిళ మాగన్‌ హుస్సేన్‌‌ను నియమించారు. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీపై పళనిస్వామి, పన్నీర్‌సెల్వంకే పట్టు ఉండేలా రాజ్యాంగాన్ని మార్చేశారు. పార్టీ జనరల్‌ సెక్రటరీ అన్న పదవే లేకుండా రాజ్యాంగంలో మార్పులు చేశారు. దీని ప్రకారం.. అన్నాడీఎంకేలో ఇకపై కోఆర్డినేటర్‌, జాయింట్‌ కోఆర్డినేటర్‌ పదవులు మాత్రమే ఉంటాయి. అన్నాడీఎంకే కోఆర్డినేటర్‌గా పళనిస్వామి, జాయింట్‌ కోఆర్డినేటర్‌గా పన్నీర్‌ సెల్వం కొనసాగుతారు. పార్టీ కార్యవర్గ సభ్యులకు ఒకే ఓటు ఉంటుంది. మరోవైపు అన్నాడీఎంకే కీలక ప్రకటన విడుదల చేసింది. ఓటింగ్‌ పద్ధతిలో పార్టీ సమన్వయకర్తల ఎన్నిక జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ నెల 7న అన్నాడీఎంకే పార్టీ ఆఫీసులో పార్టీ సమన్వయకర్తల ఎన్నికల జరుగుతుంది. అదేరోజు అన్నాడీఎంకే కోఆర్డినేటర్‌, జాయింట్‌ కోఆర్డినేటర్‌ పదవుల కోసం ఎన్నిక జరుగుతుంది. అన్నాడీఎంకే కోఆర్డినేటర్‌గా పళనిస్వామి , జాయింట్‌ కోఆర్డినేటర్‌గా పన్నీర్‌సెల్వం ఎన్నిక లాంఛనమే.

Also read:

HMDA: మూసీ తీరంలో కాసుల వర్షం.. ఉప్పల్‌ భగాయత్‌ గజం ఎంతో తెలుసా..

Hebah Patel: హెబ్బా పటేల్‌ను ఇలా ఎప్పుడైనా చూసారా ?? ఆకట్టుకుంటున్న కుమారి లేటెస్ట్ ఫొటోస్

Johannes Vetter-Neeraj Chopra: నీరజ్ స్వర్ణం గెలవడం భారత్‌కే కాదు.. జావెలిన్ క్రీడకే గర్వకారణం: జర్మన్ త్రోయర్ జోహన్నెస్ వెటర్