Tamil Nadu Floods: అసలు సిసలైన సీఎం అనిపించుకుంటున్న స్టాలిన్.. ఇంతకీ ఆయన ఏం చేశారో తెలుసా..!
Tamil Nadu CM Stalin: అధికారం చెలాయించడం కాదు.. ఆపదలో ఉన్నప్పుడు నేనున్నా అంటూ వచ్చేవాడే నాయకుడు. భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న ముంపు ప్రాంతాల్లో పర్యటించి..

Tamil Nadu CM Stalin: అధికారం చెలాయించడం కాదు.. ఆపదలో ఉన్నప్పుడు నేనున్నా అంటూ వచ్చేవాడే నాయకుడు. భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న ముంపు ప్రాంతాల్లో పర్యటించి.. అసలు సిసలైన సీఎం అనిపించుకుంటున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. గత కొద్ది రోజులుగా భారీ వర్షాలతో తమిళనాడు అల్లాడిపోతోంది. ఈ జిల్లా.. ఆ జిల్లా అని ఏం లేదు. అన్ని ప్రాంతాలనూ వరదలు చుట్టేశాయి. భారీగా ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. దీంతో సీఎం స్టాలిన్ స్వయంగా రంగంలోకి దిగారు. ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తు్న్నారు. సహాయక చర్యలను దగ్గరుండి పరిశీలించడమే కాకుండా.. బాధితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు అధికారులతో రివ్యూ చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి నిర్లక్ష్యం కనిపించొద్దని.. ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేస్తున్నారు.
10 రోజులుగా చెన్నై నగరంలోని పలు ప్రాంతాల్లో వరదనీరు నిలిచివుండడం, ఎటు చూసినా మురుగునీరు పారుతుండడంతో అంటు వ్యాధులు ప్రబలే అవకాశముందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో వరద నీరు, మురుగునీటిని తొలగించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం. వాననీటిని మోటారు పంపులతో యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నప్పటికీ నగరంలోని పలు ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. రెండు రోజులుగా వర్షం తగ్గిపోయినప్పటికీ సెమ్మంజేరి, ఓఎమ్మార్, ముట్టుకాడు, తాళంబూరు, తిరుప్పోరూరు, వెస్ట్‌మాంబళం, కోయంబేడు, మధురవాయల్, అరుంబాక్కం, పుళల్, మనలి పుదునగర్ తదితర ప్రాంతాల్లోని జనావాసాల్లో వరదనీరు ఇంకా ప్రవహిస్తూనే వుంది. పాతమహాబలిపురం రోడ్డులోని పడూరు, సెమ్మంజేరి తదితర ప్రాంతాల్లో కాలనీలు వరద నుంచి ఇంకా తేరుకోలేదు. తిరుప్పోరూరు ప్రాంతంలో 40 చెరువులు నీటితో నిండి పొంగి ప్రవహిస్తున్నాయి. సుమారు ఐదువేలకు పైగా ఇళ్లలో వర్షపునీరు ప్రవహిస్తోంది. రోజుల తరబడి నీరు నిల్వ ఉండడంతో డెంగ్యూ లాంటి విష జ్వరాలు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో అలర్ట్ అయిన ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు తీసుకుంటోంది.
Also read:
HMDA: మూసీ తీరంలో కాసుల వర్షం.. ఉప్పల్ భగాయత్ గజం ఎంతో తెలుసా..
Hebah Patel: హెబ్బా పటేల్‌ను ఇలా ఎప్పుడైనా చూసారా ?? ఆకట్టుకుంటున్న కుమారి లేటెస్ట్ ఫొటోస్