Omicron Terror: అక్కడ రెండు డోసుల టీకా లేకుంటే ప్రభుత్వ ఆఫీసుల్లోకి ప్రవేశం లేదు.. సంచలన నిర్ణయం తీసుకున్న రాష్ట్రం!

Omicron Terror: అక్కడ రెండు డోసుల టీకా లేకుంటే ప్రభుత్వ ఆఫీసుల్లోకి ప్రవేశం లేదు.. సంచలన నిర్ణయం తీసుకున్న రాష్ట్రం!
Omicron

కరోనా కొత్త ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనల నేపధ్యంలో బీహార్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే, బీహార్‌లో ఇప్పటివరకు ఈ కొత్త వేరియంట్‌కు సంబంధించిన కేసు ఏదీ వెలుగులోకి రాలేదు.

KVD Varma

|

Dec 02, 2021 | 9:50 PM

Omicron Terror: కరోనా కొత్త ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనల నేపధ్యంలో బీహార్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే, బీహార్‌లో ఇప్పటివరకు ఈ కొత్త వేరియంట్‌కు సంబంధించిన కేసు ఏదీ వెలుగులోకి రాలేదు. అయినప్పటికీ ప్రభుత్వం దానిని సమర్ధంగా ఎదుర్కోవడానికి సిద్ధం అవుతోంది. మూడో తరంగం వచ్చే అవకాశం ఉండకుండా.. ప్రభుత్వం అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. రక్షణ కోసం కొత్త మార్గదర్శకాన్ని విడుదల చేసింది. దీని తర్వాత ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోకుండా ప్రవేశించడం కుదరదు. అలా చేసిన వారిపై చర్యలు తీసుకోవచ్చు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోని వారు ప్రభుత్వ కార్యాలయాల్లోకి రాకుండా బీహార్ లో నిషేధం విధించారు. ప్రభుత్వం తక్షణమే ఈ విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఇది మాత్రమే కాదు, డబుల్ డోస్ తీసుకోని వ్యక్తులు దుకాణాన్ని లేదా సంస్థను కూడా నిర్వహంచ కూడదని షరతు విధించారు.

కోవిడ్-19కి సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో పలు ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలన్నీ డిసెంబర్ 1 నుంచి 15 వరకు అమలులో ఉంటాయి. కొవిడ్ వ్యాక్సిన్ పొందిన వ్యక్తిని మాత్రమే దుకాణం స్థాపనలో పని చేయడానికి అనుమతిస్తామని కొత్తగా జారీ చేసిన ఉత్తర్వులో స్పష్టం చేశారు. షాపు నిర్వాహకులందరూ అక్కడ పనిచేసే వ్యక్తులకు టీకాలు వేయించాలి. టీకా రుజువు కాపీని కూడా ఉంచుకోవాలి. అలాగే, కార్యాలయంలో మాస్క్‌లు మరియు శానిటైజర్‌లను ఏర్పాటు చేయాలి. అదే సమయంలో, దుకాణాల్లో వినియోగదారుల మధ్య రెండు గజాల దూరం తప్పనిసరి. ఇక్కడ నిలబడటానికి, ఒక సర్కిల్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను నడుపుతున్న వారు కూడా వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందిని మాత్రమే ఉంచుకోవడానికి అనుమతించారు.

ప్రయాణికులు సీటు కంటే ఎక్కువ ప్రయాణించలేరు

పాట్నాలో కొత్త గైడ్‌లైన్ ప్రకారం, బస్సులో సీటు కెపాసిటీ కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించలేరు. మతపరమైన ప్రదేశాలు తెరిచి ఉంటాయి కానీ అవి కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించాల్సి ఉంటుంది. కూరగాయలు, పండ్లు, ఇతర మండీలపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. ఇక్కడ, కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించకపోతే, ఆ మార్కెట్ తాత్కాలికంగా మూసి వేస్తారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే.. విపత్తు నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్ 51-60 మరియు సెక్షన్ 188 ప్రకారం చర్యలు తీసుకుంటారు.

జిమ్‌లు, మాల్స్,సినిమా హాళ్లు తెరిచి ఉంటాయి

కొత్త మార్గదర్శకంలో, ప్రేక్షకుల మొత్తం సామర్థ్యంలో 50 శాతం వినియోగంతో పాట్నాలోని సినిమా హాళ్లు తెరిచి ఉంటాయి. ప్రేక్షకులు సామాజిక దూరాన్ని పాటిస్తూ, మాస్క్‌లు ధరించేలా సినిమా హాలు నిర్వహణ ఉండాలి. దీనితో పాటు, క్లబ్బులు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్ మొత్తం కెపాసిటీలో 50 శాతం హాజరుతో తెరవవచ్చు. కాబట్టి అక్కడ స్టేడియంలు , స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు కూడా తెరిచి ఉంటాయి.. కానీ, టీకాలు వేసిన వ్యక్తులు మాత్రమే ఇక్కడ సౌకర్యాలను ఉపయోగించగలరు.

ఇవి కూడా చదవండి:

Pregnancy Care: గర్భధారణ సమయంలో చురుకుగా ఉంటే.. ప్రసవ సమయంలో శక్తివంతంగా ఉంటారు.. ప్రసవవేదన తగ్గుతుంది!

Electricity Bill 2021: ఈ బిల్లుతో కరెంట్ చార్జీలు మీ జేబులు ఖాళీ చేస్తాయి.. అయినా ఫర్వాలేదు అంటున్న ప్రభుత్వం ఎందుకంటే..

Omicron: ఒమిక్రాన్ గురించి పూర్తిగా తెలిసేది అప్పుడే.. టేకిటీసీ పాలసీ ముప్పు తెస్తుంది..బ్రిటన్ శాస్త్రవేత్త హెచ్చరిక!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu