Telangana Corona Updates: తెలంగాణ కరోనా రౌండప్.. రాష్ట్రవ్యాప్తంగా ఇవి పరిస్థితులు

Telangana Corona Updates: తెలంగాణ కరోనా రౌండప్.. రాష్ట్రవ్యాప్తంగా ఇవి పరిస్థితులు
Telangana Corona

బ్రిటన్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే అది ఏ వేరియంట్ అనేది ఇంకా కన్ఫామ్ కాలేదు.

Ram Naramaneni

|

Dec 03, 2021 | 10:05 AM

బ్రిటన్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే అది ఏ వేరియంట్ అనేది ఇంకా కన్ఫామ్ కాలేదు. ప్రస్తుతానికి ఆమెను ఐసోలేషన్‌లో ఉంచి.. కాంటాక్ట్స్ ట్రేస్ చేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. మాస్క్ లేకపోతే వెయ్యి రూపాయల ఫైన్ వేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. వ్యాక్సిన్ సర్టిఫికెట్ కూడా తప్పనిసరిగా పరిశీలిస్తామని తెలిపారు తెలంగాణ DH శ్రీనివాసరావు.

సూర్యాపేట డీఎంహెచ్‌వో కోటాచలం కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. డీఎంహెచ్‌వో కుటుంబంలో ఆరుగురికి కరోనా సోకింది. జనవరి 19న జర్మనీ నుంచి DMHO కుమారుడు వచ్చారు. 2 రోజుల క్రితం ఫ్యామిలీ అంతా తిరుపతికి వెళ్లొచ్చారు. నిన్న ఎయిడ్స్ డే సందర్భంగా.. వైద్యసిబ్బందికి బహుమతులు కూడా ఇచ్చారు DMHO కోటాచలం. దీంతో అందరిలోనూ కలవరం మొదలైంది.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశంలో కరోనా కలకలం రేపుతోంది. బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్ధులకు పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో తల్లిదండ్రులు, విద్యార్ధులు, స్కూల్ సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు సరూర్‌నగర్‌లోని పననియా మెడికల్‌ కాలేజీలో ముగ్గురికి కరోనా పాజిటివ్ తేలింది. మొత్తం క్లాస్‌లో 90 మంది విద్యార్థులు ఉండడంతో .. వారందరిలోనూ టెన్షన్ నెలకుంది

జగిత్యాల జిల్లాలోనూ కరోనా భయపెడుతోంది. పట్టణంలోని కృష్ణా నగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్ధికి కరోనా సోకింది. దీంతో ఆ క్లాస్ రూమ్ మూసివేసి.. మిగిలిన తరగతులకు క్లాసులు నిర్వహిస్తున్నారు. అదే జిల్లాలో మల్యాల మండలం తాటిపల్లి గురుకుల పాఠశాలలోనూ తొమ్మిది మంది విద్యార్ధులకు కరోనా సోకింది.

రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు

రాష్ట్రంలో గురువారం 36,883 కరోనా టెస్టులు చేయగా, 189 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,76,376కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ కరోనా బులెటిన్‌ విడుదల చేశారు. కరోనాతో ఒక్కరోజులో ఇద్దరు ప్రాణాలు విడువగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,995కి చేరిందని తెలిపారు.

Also Read: మా సౌండ్ బాక్సులు డ్యామేజ్ అవుతాయ్.. యూఎస్‌లో నోటీసు బోర్డ్స్.. అల్లాడిచ్చిన తమన్

Akhanda: ‘బాలా బాబాయి చింపేశావ్’.. వైరల్ అవుతోన్న జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu