Akhanda: ‘బాలా బాబాయి చింపేశావ్’.. వైరల్ అవుతోన్న జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్

అఖండ దుమ్ము రేపుతోంది. ఇక్కడా అక్కడా అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాలయ్య ఫ్యాన్స్‌ సంబరాలు ఓ రేంజ్‌లో సాగుతున్నాయి.

Akhanda: 'బాలా బాబాయి చింపేశావ్'.. వైరల్ అవుతోన్న జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్
Balayya Jr Ntr
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 03, 2021 | 7:37 AM

అఖండ దుమ్ము రేపుతోంది. ఇక్కడా అక్కడా అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాలయ్య ఫ్యాన్స్‌ సంబరాలు ఓ రేంజ్‌లో సాగుతున్నాయి. విడుదలైన అన్ని సెంటర్లలో నందమూరి అభిమానులు జై బాలయ్య నినాదాలతో హోరెత్తిస్తున్నారు. సినిమా బ్లాక్‌ బస్టర్‌ అని చెబుతున్నారు. నెల రోజుల ముందే పండగ వాతావరణాన్ని తీసుకొచ్చిందన్నారు. సినిమా తొలిరోజే బంపర్‌హిట్‌ టాక్‌ సొంతం చేసుకోవడంతో.. అన్ని సెంటర్లలోనూ దుమ్మురేపుతోంది. హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. సింహం, లెజెండ్ తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన అఖండ అంచనాలను అందుకుందని చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగా తొలిరోజు థియేటర్ల వద్ద మాస్ జాతర కనిపించింది. చాలారోజుల తర్వాత థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. సినిమా చూసిన వారందరూ బాలయ్య పెర్ఫామెన్స్‌తో పాటు థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. సినిమాను అతను మరో లెవల్‌కు తీసుకెళ్లాడని పేర్కొంటున్నారు. సింహా, లెజెండ్‌కు మించి బోయ‌పాటి స‌న్నివేశాల‌ను ఎలివేట్ చేశారని తెలుస్తోంది. అఖండ పాత్రలో బాల‌య్య ప్రతి సీన్‌ను నెక్ట్స్ లెవల్‌లో ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారట డైరెక్టర్ బోయపాటి. కాగా సినిమా అదిరిపోయిందంటే పలువురు అగ్ర హీరోలు కూడా ట్వీట్లు వేస్తున్నారు. బాలయ్య ఇండస్ట్రీకి పాత రోజులను తీసుకువచ్చాడని చెబుతున్నారు. ఈ క్రమంలో అఖండ మూవీ గురించి జూనియర్ ఎన్టీఆర్ వేసిన ట్వీట్ వేసిన వైరల్ అవుతోంది.

ఇప్పుడే అఖండ చూశానని…ఈ అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు బాలా బాబాయికి మొత్తం టీమ్‌కి అభినందనలు అని పేర్కొన్నారు. హార్డ్‌కోర్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడానికి సినిమాలో చాలా మూమెంట్స్ ఉన్నాయని చెప్పుకొచ్చారు.

అఖండ సినిమాపై మహేశ్ బాబు కూడా ట్వీట్ వేశాడు. మూవీ భారీ ఓపెనింగ్స్‌తో స్టార్ట్‌ అయ్యిందని విన‌డానికి చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.  నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుతో పాటు అఖండ టీంకు అభినందన‌లు తెలిపారు.

Also Read: ఈ ఫోటోలో ఉన్నది టాలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న హీరో.. ఎవరో గుర్తుపట్టారా?

ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం