Viral Photo: ఈ ఫోటోలో ఉన్నది టాలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న హీరో.. ఎవరో గుర్తుపట్టారా?

సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. ప్రతి శుక్రవారం జీవితాలు తారుమారు అవుతుంటాయి. అప్పటివరకు స్టార్ స్టేటస్ అనుభవించనవారు సడెన్‌గా కనుమరుగు అవుతారు.

Viral Photo: ఈ ఫోటోలో ఉన్నది టాలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న హీరో.. ఎవరో గుర్తుపట్టారా?
Telugu Actor
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 02, 2021 | 1:41 PM

సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. ప్రతి శుక్రవారం జీవితాలు తారుమారు అవుతుంటాయి. అప్పటివరకు స్టార్ స్టేటస్ అనుభవించనవారు సడెన్‌గా కనుమరుగు అవుతారు. ఒకానొక సమయంలో చాక్లెట్ బాయ్‌గా వరస ఆఫర్లు దక్కించుకున్న యువ హీరో కెరీర్.. ఇప్పుడు కష్టకాలంలో ఉంది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ‘హ్యాపీడేస్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్.. ఆ తర్వాత నటించిన ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో సోలో హీరోగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. కానీ ఆ తర్వాత ఈ యువ హీరోని వరుస పరాజయాలు పలుకరించాయి. ఆ తర్వాతి కాలంలో చేసిన ‘ఏమైంది ఈవేళ’ మాత్రమే పరవాలేదనిపించింది. ఎన్నో అంచనాలతో చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. దీంతో 2015 తర్వాత స్లో అయ్యాడు ఈ హీరో. కేవలం ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తూ వస్తున్నాడు. వరుణ్ సందేశ్ తాజాగా ‘ఇందువదన’ మూవీలో నటిస్తున్నాడు. నూతన దర్శకుడు శ్రీనివాస రవీంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై యువ హీరో బాగా ఆశలు పెట్టుకున్నాడు. టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ చిత్రమైనా వరుణ్‌కు కమ్ బ్యాక్ అవుతుందో లేదో చూడాలి. ఇక ఈ యువ హీరో.. నటి వితికా షేరును వివాహమాడాడు. వీరి దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. వరుణ్ సందేశ్ ప్రముఖ రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి మనవడు.

తాజాగా వరుణ్ చిన్నప్పటి ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో సో క్యూట్ అంటూ పలువురు అభిమానులు,నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. చాలామంది వరుణ్‌ను గుర్తించలేకపోతున్నారు.

Also Read:  బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్.. థియేటర్లలో మాస్ జాతర

Telangana: వేసింది పవిత్ర హనుమాన్‌ మాల.. చేస్తోంది మాత్రం నీచపు క్రీడ