AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో ప్రస్తుతానికి అదుపులోనే కరోనా వైరస్ ట్రాన్స్ మిషన్……అయినా అప్రమత్తత అవసరమంటున్న కేంద్రం

దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ ట్రాన్స్ మిషన్ తక్కువ స్థాయిలో..అదుపులో ఉందని, గత మార్చి-మే నెలల మధ్య కాలంతో పోల్చితే ఇప్పుడు చాలావరకు తగ్గుదల కనిపిస్తోందని కేంద్రం తెలిపింది. కానీ క్లస్టర్ కేసులను ఇంకా కట్టడి చేయాల్సి ఉందని పేర్కొంది.

దేశంలో ప్రస్తుతానికి అదుపులోనే కరోనా వైరస్ ట్రాన్స్ మిషన్......అయినా అప్రమత్తత అవసరమంటున్న కేంద్రం
Virus Transmission Is Very Low Says Centre
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Jun 15, 2021 | 8:11 PM

Share

దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ ట్రాన్స్ మిషన్ తక్కువ స్థాయిలో..అదుపులో ఉందని, గత మార్చి-మే నెలల మధ్య కాలంతో పోల్చితే ఇప్పుడు చాలావరకు తగ్గుదల కనిపిస్తోందని కేంద్రం తెలిపింది. కానీ క్లస్టర్ కేసులను ఇంకా కట్టడి చేయాల్సి ఉందని పేర్కొంది. 2020 లో కన్నా ఈ ఏడాది మనం హెచ్చు స్థాయిలో ఈ ట్రాన్స్ మిషబుల్ (వ్యాప్తి చెందగల) వేరియంట్ ను ఎదుర్కొన్నామని నీతి ఆయోగ్ (హెల్త్) సభ్యుడు డా. వీ.కె. పాల్ తెలిపారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త్జ కార్యదర్శి లవ్ అగర్వాల్ తో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన …..ఈ ప్రమాదకరమైన వేరియంట్ కారణంగా అప్పటికన్నా ఇప్పుడే ఇంకా ఎక్కువ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కోవిద్ అప్రోప్రియేట్ బిహేవియర్ అన్నది ముఖ్యం అన్నారు. అంటే మాస్కుల ధారణ, భౌతిక దూరం పాటంపు వంటిని నేటికీ చాలా ముఖ్యమన్నారు. కాగా అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను మానుకోవాలని లవ్ అగర్వాల్ చెప్పారు. లోగడ మనం నిర్లక్ష్యంగా ఉన్నామని, కానీ ప్రస్తుతం గతంలో కన్నా జాగరూకతతో ఉండాలని ఆయన పేర్కొన్నారు.

డెల్టా వేరియంట్ లోని మరో వేరియంట్ డెల్టా ప్లస్ ను యూరప్ లో కనుగొన్నారని….మార్చిలోనే ఈ స్ట్రెయిన్ ని అక్కడి రీసెర్చర్లు దీనిపై పరిశోధనలు చేశారని వీ.కె. పాల్ చెప్పారు. ఇటీవల ఈ వేరియంట్ ఇండియాలో ప్రవేశించినట్టు భావిస్తున్నామని, ఇది అంత ప్రమాదకరమైనది కాకపోయినా అలర్ట్ అన్నది అతి ముఖ్యమని అయన చెప్పారు. కేసులు తగ్గుతున్నాయి కదా అని ఇదివరకు మాదిరి నిర్లక్ష్యం పనికి రాదన్నారు. ఉదాహరణకు బ్రిటన్ లో ..ముఖ్యంగా ఇంగ్లాండ్ లో మళ్ళీ లాక్ డౌన్ ఆంక్షలను మరో నెల రోజుల పాటు పొడిగించారని ఆయన చెప్పారు.

మరిన్ని ఇక్కడ చూడండి: రైళ్లో సీటు కోసం ఏకంగా యువకుడు చేసిన తతంగం నవ్వులు పూయిస్తున్న వీడియో : Viral Video.

Rare Photos and videos: ఒకే ఫేమ్ లో టాలీవుడ్ లెజెండరీ హీరోలు.. 33 ఏళ్ళక్రితం ఫోటో వైరల్ వీడియో.

 Dog Viral Video : చెట్టు కొట్టకుండా అడ్డుపడిన కుక్క..ఎందుకంటే!వైరల్ అవుతున్న వీడియో.

యంగ్ హీరో నిఖిల్ ఖాతాలో మరో మూడు సినిమాలు.?బిజీ బిజీ గా యంగ్ హీరో :Nikhil Siddharth Video.