AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Security Guard: బ్లాక్ క్యాట్ కమాండోలను (ఎన్‌ఎస్‌జీ) ఎలా ఎంపిక చేస్తారో తెలుసా?

National Security Guard: ప్రధానమంత్రితో సహా దేశంలోని హై రిక్స్‌ వీఐపీలకు రక్షణ కల్పించేందుకు గాను 1984 లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

National Security Guard: బ్లాక్ క్యాట్ కమాండోలను (ఎన్‌ఎస్‌జీ) ఎలా ఎంపిక చేస్తారో తెలుసా?
Black Cat Commandos
Venkata Chari
|

Updated on: Jun 15, 2021 | 8:59 PM

Share

Black Cat Commandos: వీఐపీల భద్రతలో ‘బ్లాక్ క్యాట్ కమాండోలు’ ప్రముఖ పాత్ర పోషించడాన్ని మనం తరుచుగా వింటుంటాం. బ్లాక్ క్యాట్ కమాండోలు.. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) సిబ్బంది. ప్రధానమంత్రితో సహా దేశంలోని హై రిస్క్ వీఐపీలకు రక్షణ కల్పించేందుకు గాను 1984 లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఏర్పడింది. అత్యంత కఠినమైన ప్రక్రియలతో ఎంపిక చేయబడిన సైనికులు వీరు. 26/11 ఉగ్రవాద దాడిలోనూ ఈ కమాండోలు ఎంటరై పరిస్థితిని నియంత్రించారు. కౌంటర్ టెర్రరిస్ట్, యాంటీ హైజాక్ లాంటి ప్రధాన విధులకు బ్లాక్ క్యాట్ కమాండోలను వినియోగించనున్నారు. వాస్తవానికి ఎన్‌ఎస్‌జీని యాంటీ టెర్రరిస్ట్, యాంటీ హైజాక్ ఆపరేషన్ల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తరువాత కొంత కాలానికి ఈ కమాండోలను వీఐపీల భద్రత కోసం కేటాయించారు. అయితే, దేశంలోనే అత్యంత కీలకమైన ఎన్‌ఎస్‌జీ కమాండోలు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కన్నా హై రిస్క్ వీఐపీలకు సేవలందిచాల్సి వస్తుందని భావించిన కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని రద్దు చేసింది. దీంతో బ్లాక్ క్యాట్ కంమాండోలు కేవలం కౌంటర్ టెర్రరిస్ట్, యాంటీ హైజాక్ వంటి విధులకు మాత్రమే పరిమితం చేసింది. ప్రస్తుతం వీఐపీల భద్రతను పారా మిలటరీ దళాలు పర్యవేక్షిస్తున్నాయి.

అయితే బ్లాక్ క్యాట్ కమాండోల ఎంపిక చాలా కఠినంగా సాగుతుంది. ఎన్‌ఎస్‌జీలను ప్రత్యక్ష నియామక ప్రక్రియ అనేది ఏదీ లేదు. ఇందుకోసం సైనికులు, పారా మిలటరీ దళాల నుంచి ఎంపిక చేస్తారు. ఎంపికలో 53 శాతం భారత సైన్యం నుంచే జరుగుతుంది. మిగతా 47 శాతం కమాండోలను నాలుగు పారా మిలటరీ దళాల(CRPF, ITBP, RAF, BSF)నుంచి ఎంపిక చేస్తారు.

శిక్షణ: కమాండోలుగా ఎంపికైన వారికి 90 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ప్రారంభంలో వీరు ఓ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించవలసి ఉంటుంది. అనంతరం వారం రోజుల పాటు చాలా కఠినమైన శిక్షణ పొందనున్నారు. కాగా, ఈ కఠిన శిక్షణలో దాదాపు 80 శాతం మంది జవాన్లు ఫెయిల్ అవుతారని చెబుతుంటారు. కేవలం 20 శాతం మంది మాత్రమే తరువాతి దశకు చేరుకుంటారంట. ఇక చివరి రౌండ్ పరీక్షల నాటికి ఈ సంఖ్య 15 శాతానికి తగ్గుతుందంట.

చివరి దశ ఎంపిక తరువాత క్లిష్టమైన రౌండ్ లోకి ఎంటర్ అవుతారు. ఈ దశలో వీరికి దాదాపు 90 రోజుల పాలు శిక్షణ ఇస్తారు. ఈ సమయంలో వీరికి శారీరక, మానసికంగా శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ ప్రారంభంలో 40 శాతం అర్హతగా ఉన్న సైనికులు.. ఈ ట్రైనింగ్ ముగిసే నాటికి 90 శాతం అర్హత సాధిస్తారు. ఈ సమయంలోనే వీరికి బాటిల్ అస్సాల్ట్ అబ్స్ట్రక్షన్ కోర్సు తోపాటు కౌంటర్ టెర్రరిస్ట్ కండిషనింగ్ కోర్సుల్లోనూ శిక్షణ ఇస్తారు. ఫైనల్‌గా వీరి మానసిక స్థితి ఎలా ఉందనే అంశంపై ఓ పరీక్ష నిర్వహిస్తారు.

జీతం: ఎన్‌ఎస్‌జీ కమాండోల జీతం నెలకు రూ .84 వేల నుంచి రూ. 2.5 లక్షల వరకు ఉంటుంది. సగటున నెలకు సుమారు రూ. 1.5 లక్షలు ఉండనుంది. ఇవి కాకుండా ఇతర అలవెన్సులు కూడా అందనున్నాయి.

Also Read: జియో నుంచి మరో ఆఫర్.. కొత్త ‘జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్’ ప్రారంభం..పూర్తి వివరాలు..