Bharosa Society Jobs: తెలంగాణ పోలీస్ విభాగం, భరోసాలో ఉద్యోగాలు… అర్హులు ఎవరు? ఎలా అప్లై చేసుకోవాలి.?
Bharosa Society Jobs: తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగానికి చెందిన భరోసా సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేశారు. ఇందులో భాగంగా తెలంగాణలోని సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట్, వరంగల్...
Bharosa Society Jobs: తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగానికి చెందిన భరోసా సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేశారు. ఇందులో భాగంగా తెలంగాణలోని సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట్, వరంగల్ జిల్లాల్లో ఉద్యోగులను తీసుకోనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా కాంట్రాక్ట్ విధానంలో అభ్యర్థులను తీసుకోనున్నారు.
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* వరంగల్ జిల్లాకు గాను.. లీగల్ సపోర్ట్ ఆఫీసర్ (01) పోస్టును భర్తీ చేయనున్నారు. దీనికి అభ్యర్థులకు.. ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 35-55 ఏళ్ల మధ్య ఉండాలి.
* వికారాబాద్ జిల్లాకు సంబంధించి సపోర్ట్ పర్సన్, డేటాఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్ (02) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. ఎంఏ సైకాలజీ/ఎంఎస్‌డబ్ల్యూ, టాలీతో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్‌తోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
* సూర్యాపేట జిల్లా విషయానికొస్తే.. సెంటర్ కోఆర్డినేటర్ కమ్ సైకాలజిస్ట్, సపోర్ట్ పర్సన్, లీగల్ సపోర్ట్ ఆఫీసర్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఏఎన్‌ఎం, డేటాఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్, రిసెప్షనిస్ట్ (06) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. పోస్టుని అనుసరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఎస్సీ(నర్సింగ్), ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం, ఎంఎస్/ఎంఎస్‌డబ్ల్యూ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
* సంగారెడ్డి జిల్లాకు సంబంధించి లీగల్ సపోర్ట్ ఆఫీసర్ (01) పోస్టును భర్తీ చేయనున్నారు. ఇందుకుగాను అభ్యర్థులు ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆయా జిల్లాల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయాలకు పంపిచాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు 28.06.2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
National Security Guard: బ్లాక్ క్యాట్ కమాండోలను (ఎన్‌ఎస్‌జీ) ఎలా ఎంపిక చేస్తారో తెలుసా?
CLAT 2021 : క్లాట్ పరీక్ష తేదీ ఖరారు.. దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజే చివరితేదీ..