AP Vaidya Vidhana Parishad: ఏపీ వైద్య విధాన పరిషత్‌లో సర్జన్ ఉద్యోగాలు.. పని అనుభవం ఆధారంగా ఎంపిక..
AP Vaidya Vidhana Parishad Recruitment 2021: ఆంధ్రప్రదేశ్ వైవ్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ ప్రభుత్వ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన...
AP Vaidya Vidhana Parishad Recruitment 2021: ఆంధ్రప్రదేశ్ వైవ్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ ప్రభుత్వ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఏపీవీవీపీలో ఏకంగా 453 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.
భర్తీచేయనున్న పోస్టులు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 453 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఇందులో భాగంగా.. గైనకాలజీ (269), పీడియాట్రిక్స్ (11), అనెస్తీషియా (64), జనరల్ మెడిసిన్ (30),జనరల్ సర్జరీ (16), ఆర్థోపెడిక్స్ (12), పాథాలజీ (05), ఆప్తాల్మాలజీ (09), రేడియాలజీ (21), సైకియాట్రీ (02), డెర్మటాలజీ (06), ఈఎన్‌టీ (08) విభాగాల్లో పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/డిప్లొమా/డీఎన్‌బీ/తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సెల్‌లో శాశ్వత రిజిస్ట్రేషన్ ఉండాలి.
* అభ్యర్థుల వయసు 01.07.2021 నాటికి 42ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* అభ్యర్థులను అకడెమిక్ మెరిట్, గతంలో పనిచేసిన అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 14-06-2021 నుంచి ప్రారంభం కాగా.. చివరి తేదీని 28-06-2021గా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
NIRDPR Recruitment 2021: హైదరాబాద్ ఎన్ఐఆర్‌డీపీఆర్‌లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..