AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: రెండేళ్ల తమ్ముడి శవాన్ని కాలినడకన మోసుకెళ్లిన 10 ఏళ్ల అన్నయ్య.. గుండెలు పిండేసే ఘటన..

కాలా  తండ్రి, సోదరుడు మృతదేహాన్ని తమ చేతుతో మోస్తూ తీసుకువెళ్లారు. స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధికారులు స్పందించి వ్యాన్ ను ఏర్పాటు చేశారు.

Viral News: రెండేళ్ల తమ్ముడి శవాన్ని కాలినడకన మోసుకెళ్లిన 10 ఏళ్ల అన్నయ్య.. గుండెలు పిండేసే ఘటన..
Up Hospital
Surya Kala
|

Updated on: Aug 29, 2022 | 12:57 PM

Share

Viral News: కారు ప్రమాదంలో గాయపడి తనువు చాలించాడు రెండేళ్ల చిన్నారి బాలుడు. అయితే బాలుడి మృతదేహాన్ని స్వగ్రామం తీసుకుని వెళ్ళడానికి అంబులెన్స్ ఇవ్వకపోవడంతో.. ప్రయివేట్ వాహనాన్ని ఏర్పాటు చేసుకునే  స్తోమతలేని ఆ ఫ్యామిలీ చిన్నారి మృతదేహాన్ని చేతుల్లోకి తీసుకుని కాలినడకన వెళ్ళింది. ఈ సందర్భంగా తీసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

శనివారం UPలోని బాగ్‌పత్‌లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రెండేళ్ల కాలా మృత దేహానికి శవపరీక్ష చేశారు. అనంతరం శవాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళడానికి కుటుంబ సభ్యులు శవ వాహనం అడిగారు. అయితే వాహనం ఏర్పాటు కాలేదు. దీంతో కాలా  తండ్రి, సోదరుడు మృతదేహాన్ని తమ చేతుతో మోస్తూ తీసుకువెళ్లారు. స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధికారులు స్పందించి వ్యాన్ ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కాలా శవాన్ని చిన్నారి 10 ఏళ్ల అన్నయ్య మోసిన దృశ్యం పలువురిని కదిలించింది. మృతుడు తండ్రి ప్రవీణ్ కుమార్, బాగ్‌పత్‌లో రోజువారీ కూలీ. షామ్లీ జిల్లాలోని లిలోంఖేడిలో నివాసితున్నారు. మృతదేహాన్ని తరలించడానికి వాహనం కోసం అద్దెకు రూ.1,000 ఖర్చు పెట్టె ఆర్ధిక స్తొమత ఆ కుటుంబానికి లేదు.

Up Hospital 1

Up Hospital 1

ఢిల్లీ-సహారన్‌పూర్ హైవేపై బాగ్‌పట్‌లోని బ్యాంకు సమీపంలో కారు ఢీకొని రెండేళ్ల చిన్నారి శుక్రవారం మరణించాడు. సవతి తల్లి సీత బాలుడి శవాన్ని దూరంగా విసిరేసింది. దీంతో పోలీసులు  ఆమెను అక్కడికక్కడే అరెస్టు చేశారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం పరీక్ష కోసం జిల్లా ప్రభుత్వాస్పత్రికి పంపారు. మరుసటి రోజు ఆసుపత్రిలో.. ప్రవీణ్ కుమార్, అతని మరో కుమారుడు సాగర్‌తో పాటు బంధువు రాంపాల్ కూడా ఉన్నారు. అయితే బాలుడు మృతదేహాన్ని తమ గ్రామం తీసుకెళ్లడానికి ఏదైనా వాహనం కావాలని పదేపదే అభ్యర్థించారని చెప్పారు.

ఇవి కూడా చదవండి
Up Hospital 2

Up Hospital 2

అధికారులు పట్టించుకోవడం లేదు.. దీంతో శవాన్ని తీసుకుని స్వగ్రామం కాలినడకన బయలుదేరారు. ప్రజలు వీడియోలను రికార్డ్ చేయడం ప్రారంభించడంతో వెంటనే అధికారులు స్పందించి వాహనాన్ని ఏర్పాటు చేశారు.

Up Hospital 3

Up Hospital 3

చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ.. “మేము వారిని శవ వాహనం వచ్చే వరకు కొంత వేచి ఉండమని కోరాము. కానీ వారు నిరాశ చెందారు. వెంటనే వెళ్లిపోయారు. వ్యాన్ ఎందుకు ఆలస్యం అయిందో పరిశీలిస్తామని చెప్పారు.”

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..