పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభం…..పాట్నాలోని ఎయిమ్స్ లో కోవాగ్జిన్ తో శ్రీకారం….
థర్డ్ కోవిద్ వేవ్ ముప్పు నేపథ్యంలో 2 నుంచి 18 ఏళ్ళ మధ్యవయస్సువారిపై వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. బీహార్ రాజధాని పాట్నాలోని ఎయిమ్స్ లో నిన్న ఏడుగురు పిల్లలకు కోవాగ్జిన్ వ్యాక్సిన్ తొలి డోసును ఇచ్చారు. నిజానికి ఈ నెల 3 న ముగ్గురు బాలలకు టీకామందును ఇచ్చామని...
థర్డ్ కోవిద్ వేవ్ ముప్పు నేపథ్యంలో 2 నుంచి 18 ఏళ్ళ మధ్యవయస్సువారిపై వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. బీహార్ రాజధాని పాట్నాలోని ఎయిమ్స్ లో నిన్న ఏడుగురు పిల్లలకు కోవాగ్జిన్ వ్యాక్సిన్ తొలి డోసును ఇచ్చారు. నిజానికి ఈ నెల 3 న ముగ్గురు బాలలకు టీకామందును ఇచ్చామని, వీరందరి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. నిన్న స్క్రీన్ టెస్ట్ రిపోర్టులు పరీక్షించగా కొంతమందిలో యాంటీ బాడీలు డెవలప్ అయినట్టు తేలిందని ఈ వర్గాలు వివరించాయి. దీంతో మరికొంతమంది బాలలకు కూడా కోవాగ్జిన్ ఇచ్చినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు మొత్తం 10 మందికి టీకామందు ఇచ్చామని, 28 రోజుల తరువాత వీరు రెండో డోసు తీసుకోవలసి ఉంటుందని వైద్య బృందం తెలిపింది. కనీసం 100 మంది పిల్లలు, టీనేజర్లకు వ్యాక్సిన్ ఇవ్వాలన్నది తమ లక్ష్యమని ఈ బృందం సభ్యులు చెప్పారు. ఇప్పటికే అమెరికా వంటి దేశాల్లో పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా.. తాజాగా చైనా కూడా నిన్నటినుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. థర్డ్ కోవిద్ వేవ్ నుంచి బాలలను రక్షించేందుకు పాట్నా లోని ఎయిమ్స్ లో ట్రయల్స్ నిర్వహించడం సంతోషకరమని బీహార్ ఆరోగ్య శాఖ మంత్రి మంగళ్ పాండే అంటున్నారు.ఈ ట్రయల్స్ సక్సెస్ అవుతాయని ఆయన పూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా- అహమ్మదాబాద్ లో జైడస్ క్యాడిలా కంపెనీ తయారు చేస్తున్న జైకొవ్-డీ వ్యాక్సిన్ ట్రయల్స్ ని 12-18 ఏళ్ళ మధ్య వయస్కులపై నిర్వహించాలన్న యోచన ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు డా.వీ.కె, పాల్ తెలిపారు. రానున్న 2 వారాల్లో ఈ సంస్థ లైసెన్స్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు పెడుతుందని ఆయన చెప్పారు.
మరిన్ని ఇక్కడ చూడండి: నవ్వులు పూయిస్తున్న ఏనుగు వింత చేష్టలు..నీరు త్రాగేందుకు కూడా సోమరితనాన్ని ప్రదర్శిస్తున్న గజరాజు..:Elephant Viral Video