Covid-19 Vaccine: ఓ అధికారిని వినూత్న ఆలోచన. ప్రతిఒక్కరికి కరోనా టీకా కోసం గ్రామాలను దత్తత తీసుకుంటున్న పెద్దలు ఎక్కడంటే..!

Covid-19 Vaccine:  దేశంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్న వేళ.. బాధితులకు అండగా ఎంతో మంచి సాయం అందిస్తున్నారు. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ..

Covid-19 Vaccine: ఓ అధికారిని వినూత్న ఆలోచన. ప్రతిఒక్కరికి  కరోనా టీకా కోసం గ్రామాలను దత్తత తీసుకుంటున్న పెద్దలు ఎక్కడంటే..!
Corona
Follow us
Surya Kala

|

Updated on: Jun 06, 2021 | 2:44 PM

Covid-19 Vaccine:  దేశంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్న వేళ.. బాధితులకు అండగా ఎంతో మంచి సాయం అందిస్తున్నారు. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ ఆక్సిజన్, మందులు, ఆహారం వంటివి అందిస్తున్నారు. అయితే కరోనా నివారణకు కోవిడ్ నిబంధనలు పాటించడం ఎంత ముఖ్యమో.. వ్యాక్సిన్ వేయించుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంపై చాలా మందిలో అపోహ ఉండడంతో చాలా ప్రాంతాల్లో టీకా వేయించుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదు. దీంతో సూరత్ వంటి కొన్ని ప్రాంతాల్లో వ్యాపారస్తులు స్వచ్ఛదంగా ముందుకు వచ్చి టీకా వేయించుకున్నవారికి బంగారు ముక్కుపుడక వంటి బహుమతులను ప్రకటించారు.. అయితే తాజాగా పంజాబ్ లోని ఓ జిల్లాలో జరుగుతున్న కొత్త రకం సాయం కూడా దేశం మొత్తాన్ని ఆకట్టుకుంటోంది. ఈ పద్ధతిని ఇతర రాష్ట్రాల వారు పాటిస్తే.. వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈజీగా పూర్తి చేయవచ్చు అని అంటున్నారు.

అంతగా ఆకర్షిస్తున్న విషయం ఏమిటంటే.. గ్రామాన్ని దత్తత తీసుకోవడం. మొహాలీ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను జిల్లా డిప్యూటీ కమిషనర్‌ గిరీష్‌ దయాలన్‌ ముందు నుంచి ఓ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. దీంతో ఇక్కడ ప్రజలు వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి ముందుకొస్తున్నారు. అయితే తాజాగా 18-45 ఏళ్ల వారికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేయగానే నే గిరీశ్‌ దయాలన్‌ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు.

కొంతమంది ఉద్యోగులు గ్రామాలను దత్తత తీసుకుని అక్కడ ఉన్నవారికి టీకా వేయించారు. అలా వ్యాక్సిన్ వేయించడానికి అయ్యే ఖర్చు మొత్తం దత్తత తీసుకున్న ఉద్యోగులు భరించారు. ఉద్యోగస్తులను చూసి ఇన్స్పైర్ అయిన పెద్దలు, ముందుకొచ్చి సీఎఎస్‌ఆర్‌ పాలసీ కింద డబ్బులు వెచ్చింది స్థానికులకు వ్యాక్సినేషన్‌ వేయిస్తున్నారు.

ఇలా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టిన పెద్దలు.. ఆయాగ్రామాలకు వెళ్లి.. కార్యక్రమం ఎలా జరుగుతుందనేది పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్ లో కరోనా నివారణకు గ్రామాల దత్తత కార్యక్రమం బాగా ప్రాచుర్యం పొందింది. ఆంటీకాదు.. చాలామంది దత్తత తీసుకోవడానికి ముందుకొస్తున్నారని గిరీశ్‌ చెబుతున్నారు.

ఈ దత్తత తో మొహాలీ జిల్లాలో 13 గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ పూర్తిఅయిందని.. త్వరలోనే మరింత మంది సహకారంతో మరిన్ని గ్రామాల్లో వ్యాక్సినేషన్ అయ్యేలా చూస్తామని గిరీష్ చెప్పారు. దత్తత తీసుకున్న వ్యక్తి.. వ్యాక్సినేషన్‌ కోసం ఒక్కో డోసుకు జిల్లా యంత్రాంగానికి రూ.430 చెల్లించాలి. ఆ డబ్బును ప్రభుత్వానికి ఇచ్చి వ్యాక్సిన్‌ కొనుగోలు చేస్తోంది. ఓవైపు ఇలా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహిస్తూనే.. మరోవైపు ప్రజల్లో కరోనా నివారణకు వ్యాక్సిన్‌ ఎలా పనిచేస్తుంది అనే విషయం పై అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్ కోసం గ్రామాల దత్తత అంటూ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.

Also Read: Giant Tortoise: అంతరించిందనుకున్న అరుదైన తాబేలు 100 ఏళ్ల తర్వా;త మళ్ళీ ప్రత్యక్షం