Covid-19 vaccine: రాష్ట్రాల దగ్గర 1.63 కోట్లకుపైగా వ్యాక్సిన్ల నిల్వలు : కేంద్ర ప్రభుత్వం

India Coronavirus vaccination: దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడకుండా ఉండేందుకు ప్రభుత్వం పలు ప్రణాళికలు

Covid-19 vaccine: రాష్ట్రాల దగ్గర 1.63 కోట్లకుపైగా వ్యాక్సిన్ల నిల్వలు : కేంద్ర ప్రభుత్వం
Corona Vaccination
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 06, 2021 | 2:20 PM

India Coronavirus vaccination: దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడకుండా ఉండేందుకు ప్రభుత్వం పలు ప్రణాళికలు రూపొందిస్తూ చర్యలు తీసుకుంటోంది. కాగా.. ప్రస్తుతం రాష్ట్రాల దగ్గర 1.63కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నట్లు వెల్లడించింది. కాగా.. కేంద్రం ఇప్పటి వరకు ప్రత్యక్షంగా సేకరించి రాష్ట్రాలకు 24 కోట్లకుపైగా డోసులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా చేసినట్లు తెలిపింది.

ఇందులో వ్యర్థాలతో సహా 22,96,95,199 కోవిడ్ వ్యాక్సిన్ల మోతాదులను వినియోగించినట్లు ప్రకటించింది. ఇంకా 1,63,85,701 డోసులు ఇప్పటికీ రాష్ట్రాలు, యూటీల్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఆదివారం ఉదయం 7 గంటల వరకు అందించిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా 32,42,503 సెషన్ల ద్వారా మొత్తం 23,13,22,417 మోతాదులను లబ్ధిదారులకు వేసినట్లు పేర్కొంది.

ఇదిలాఉంటే.. దేశంలో నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. దేశవ్యాప్తంగా నిన్న కొత్తగా 1,14,460 కేసులు నమోదు కాగా.. ఈ వైరస్ కారణంగా 2,677 మంది మరణించారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,88,09,339 కి పెరగగా.. మరణాల సంఖ్య 3,46,759 కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14,77,799 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Also Read:

Giant Tortoise: అంతరించిందనుకున్న అరుదైన తాబేలు 100 ఏళ్ల తర్వా;త మళ్ళీ ప్రత్యక్షం

Kasu Raghavamma Passes Away: మాజీ సీఎం సతీమణి రాఘవమ్మ కన్నుమూత.. సీఎం జగన్‌ సంతాపం