Giant Tortoise: అంతరించిందనుకున్న అరుదైన తాబేలు 100 ఏళ్ల తర్వా;త మళ్ళీ ప్రత్యక్షం

Fernandina Giant Tortoise: ఎన్నో ఏళ్ల కిందటే అంతరించిపోయిందనుకున్న ఫెర్నాన్‌డినా జెయింట్‌ తాబేలు మళ్లీ దర్శనమిచ్చి.. శాస్త్రవేత్తలను ఆనందంలో ముంచెత్తింది...

Giant Tortoise: అంతరించిందనుకున్న అరుదైన తాబేలు 100 ఏళ్ల తర్వా;త మళ్ళీ ప్రత్యక్షం
Fernandina Giant Tortoise
Follow us
Surya Kala

|

Updated on: Jun 06, 2021 | 1:49 PM

Fernandina Giant Tortoise: ఎన్నో ఏళ్ల కిందటే అంతరించిపోయిందనుకున్న ఫెర్నాన్‌డినా జెయింట్‌ తాబేలు మళ్లీ దర్శనమిచ్చి.. శాస్త్రవేత్తలను ఆనందంలో ముంచెత్తింది. పరిణామక్రమంలో జరిగిన అనేక మార్పులకు తాబేలు జాతి ప్రత్యక్ష సాక్షి అని శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. అయితే ఈ ప్రపంచంలో అనేక దేశాల్లో రకరకాల అరుదైన తాబేళ్లు ఉన్నప్పటికీ.. వాటిన్నింటికంటే ఫెర్నాన్‌డినా తాబేలు మాత్రం చాలా స్పెషల్‌ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఏ తాబేళ్లకు లేని ప్రత్యేకతలను కలిగివుంటుంది. ఈ రకం తాబేళ్లు వందేళ్లకు పైగా జీవిస్తాయి. అంతే కాకుండా.. వీటి మెడ చాలా పొడవుగా ఉంటుంది.

ఒకప్పుడు ఈ జాతి తాబేళ్లు అనేక ప్రాంతాల్లో నివసిస్తూ ఉండేవి. అయితే ఇవి క్రమంగా అంతరించిపోయాయి. దీంతో ఈ జాతి తాబేలు ఇక పూర్తిగా అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు భావించారు. ఇప్పుడు మళ్లీ కనిపించిన ఫెర్నాన్‌డినా జెయింట్‌ తాబేలును 1906లో ఆఖరిసారి చూసినట్లు రికార్డుల్లో నమోదైంది. ఆ తర్వాత ఈ తాబేలును ఎవరూ చూడలేదు. అయితే 2019 చివరలో ఈక్విడార్‌కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న గాలాపెగాస్‌ ద్వీపంలో ఈ తాబేలు కనిపించింది. అయితే ఇది ఫెర్నాన్‌డినా తాబేలా? కాదా? అనే విషయం శాస్త్రవేత్తలకు తెలియలేదు. దీనితో డీఎన్‌ఏ పరీక్షలకు పంపించగా తాజాగా ఈ పరీక్ష ఫలితాలు వచ్చాయి. ఈ పరీక్షల్లో 2019లో దొరికినది ఫెర్నాన్‌డినా తాబేలేనని తేలడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read: ఆదిలాబాద్‌ రిమ్స్ హాస్పిట‌ల్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు.. ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే..