Kasu Raghavamma Passes Away: మాజీ సీఎం సతీమణి రాఘవమ్మ కన్నుమూత.. సీఎం జగన్ సంతాపం
Kasu Raghavamma Passes Away: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి.. సతీమణి రాఘవమ్మ (97) ఆదివారం
Kasu Raghavamma Passes Away: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి.. సతీమణి రాఘవమ్మ (97) ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాఘవమ్మ సోమాజిగూడలోని తన స్వగృహంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. రాఘవమ్మ మృతితో ఆమె స్వగ్రామం ఏపీలోని గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. రాఘవమ్మ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ సంతాపం.. కాసు రాఘవమ్మ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. రాఘవమ్మ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Also read: