సూసైడ్ బాంబర్ అంటూ బ్యాంకులో యువకుడి హల్‌చల్.. రూ.55 లక్షలు డిమాండ్.. ఆ తర్వాత ఏమైందంటే..?
Man With Fake Bomb Demands ₹ 55 Lakh: ఓ వ్యక్తి దర్జాగా బ్యాంకులోకి ప్రవేశించాడు. ముసుగు వేసుకొని.. చేతిలో గన్ను పట్టుకోని నేరుగా బ్యాంకు ఉద్యోగి దగ్గరకు వెళ్లాడు.. తాను ఆత్మాహుతి బాంబర్‌ను అంటూ చిట్టిని
Man With Fake Bomb Demands ₹ 55 Lakh: ఓ వ్యక్తి దర్జాగా బ్యాంకులోకి ప్రవేశించాడు. ముసుగు వేసుకొని.. చేతిలో గన్ను పట్టుకోని నేరుగా బ్యాంకు ఉద్యోగి దగ్గరకు వెళ్లాడు.. తాను ఆత్మాహుతి బాంబర్‌ను అంటూ చిట్టిని అందించారు. 15 నిమిషాల్లో 55 లక్షలు ఇవ్వకపోతే బ్యాంకును పేలుస్తానంటూ బెదిరించాడు. కట్ చేస్తే ప్రస్తుతం ఆ వ్యక్తి ఇప్పుడు ఉచలు లెక్కబెడుతున్నాడు. వివరాలు.. మహారాష్ట్రలోని వార్ధాలోని ఒక బ్యాంకులో ఎప్పటిలాగానే శుక్రవారం రద్దీ ఉంది. మధ్యాహ్నం వేళ ముసుగు వేసుకున్న యువకుడు.. బ్యాంకు ఉద్యోగికి ఒక చిట్టి అందించాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. తాను ఆత్మాహుతి బాంబర్ అని దానిపై రాసి ఇచ్చాడు. అనంతరం సిబ్బందిలో భయాందోళనలు మొదలయ్యాయి. 15 నిమిషాల్లో 55 లక్షల రూపాయలు ఇవ్వకపోతే తనకు తాను పేల్చుకుంటానంటూ బెదిరించాడు.
ఈ క్రమంలో చాకచక్యంగా వ్యవహరించిన బ్యాంకు సిబ్బంది. సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అతని నుంచి నకిలి బాంబు, కత్తి, ఎయిర్ గన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని యోగేష్ ఖుబాడేగా గుర్తించారు.
అయితే.. ఈ యువకుడు వివిధ రోగాలతో బాధపడుతున్నాడని.. అతనికి వైద్య చికిత్స కోసం, అప్పులు తీర్చడానికి డబ్బు అవసరం కావడంతో ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. అతను ప్రస్తుతం సైబర్ కేఫ్ నడుపుతున్నాడని.. ఆన్‌లైన్‌లో తన నకిలీ బాంబులను కొనుగోలు చేసి ఈ నేరానికి పాల్పడినట్లు సేవాగ్రామ్ సబ్ ఇన్‌స్పెక్టర్ గణేష్ సాయికర్ చెప్పారు.
Also Read: