AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SI Suicide: పని ఒత్తిడి.. స్టేషన్‌లోనే సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్న ఎస్ఐ

Sub-inspector shot himself: ఢిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఏమైందో.. ఏమో తెలియదు కానీ.. ఓ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్స్‌పెక్టర్‌ సర్వీస్‌ రివాల్వర్‌తో

SI Suicide: పని ఒత్తిడి.. స్టేషన్‌లోనే సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్న ఎస్ఐ
Sub Inspector Shot Himself
Shaik Madar Saheb
|

Updated on: Jun 06, 2021 | 6:41 AM

Share

Sub-inspector shot himself: ఢిల్లీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఏమైందో.. ఏమో తెలియదు కానీ.. ఓ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్స్‌పెక్టర్‌ సర్వీస్‌ రివాల్వర్‌తో తనను తాను కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తుపాకీ తూటా తగిలి ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఇస్ట్ ఢిల్లీలోని పాండవ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఎస్సై రాహుల్ సింగ్ స్టేషన్‌ ఆవరణలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఢిల్లీలో కలకలం రేపింది. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. 2017లో రాహూల్‌ సింగ్‌ (31) పాండవ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో సబ్ ఇన్స్‌పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. నాలుగేళ్లుగా ఒకే స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తూ ఆయన శాంతిభద్రతలు పర్యవేక్షిస్తున్నారు.

అయితే అకస్మాత్తుగా శుక్రవారం స్టేషన్‌ ఆవరణలోనే తన సర్వీస్‌ రివాల్వర్‌ను తీసుకుని రాహుల్‌ తనకు తాను కాల్చుకుని ఆత్మహత్యకు చేసుకున్నారు. స్టేషన్‌లో రక్తపు మడుగుల్లో ఆయన పడి ఉండటంతో.. సిబ్బంది ఉన్నతాధికారులకు, ఆయన కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న రాహుల్ భార్య స్టేషన్‌కు వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించింది. అయితే తన భర్త ఆత్మహత్యకు కారణం పని ఒత్తిడి అని ఆమె ఆరోపించింది. స్టేషన్‌ హౌస్ ఆఫిసర్ ఒత్తిడితో తన భర్త కొంతకాలం నుంచి ఆందోళనకు గురవుతున్నారని ఆమె పేర్కొంది. కాగా.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

Red sandalwood Seized: ఆగని కలప అక్రమ రవాణా.. పది ఎర్రచందనం డంప్‌లను ఛేదించిన టాస్క్ ఫోర్స్..

విషాదం.. చిరుత పులి దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి.. అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యం..