AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Facebook alerts Delhi Police: ఆ యూజర్ చనిపోతున్నాడు.. అమెరికా నుంచి ఫేస్‌బుక్ అలెర్ట్.. ఆ తర్వాత..

Facebook alerts Delhi Police: భార్యను కోల్పోయి మానసికంగా బాధపడుతున్న ఓ 39 ఏళ్ల వ్యక్తి చనిపోదామనుకున్నాడు. ఈ ఘటనను ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమ్ చేద్దామనుకున్నాడు. దీంతో వెంటనే అమెరికాలోని ఫేస్‌బుక్ కార్యాలయం

Facebook alerts Delhi Police: ఆ యూజర్ చనిపోతున్నాడు.. అమెరికా నుంచి ఫేస్‌బుక్ అలెర్ట్.. ఆ తర్వాత..
Facebook
Shaik Madar Saheb
|

Updated on: Jun 06, 2021 | 8:06 AM

Share

Suicide Attempt – Facebook alerts Delhi Police: భార్యను కోల్పోయి మానసికంగా బాధపడుతున్న ఓ 39 ఏళ్ల వ్యక్తి చనిపోదామనుకున్నాడు. ఈ ఘటనను ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమ్ చేద్దామనుకున్నాడు. దీంతో వెంటనే అమెరికాలోని ఫేస్‌బుక్ కార్యాలయం అప్రమత్తమైంది. వెంటనే ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించి అప్రమత్తం చేసింది. దీంతో హుటాహుటిన స్పందించిన ఢిల్లీ పోలీసులు ఆ సదరు వ్యక్తి ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకొని ప్రాణాలను కాపాడారు. ద్వారకాలోని పాలెంలో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన వివరాలను పోలీసులు శనివారం వెల్లడించారు.

దక్షిణ ఢిల్లీ ద్వారక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి స్వీట్‌ షాప్‌ ఉంది. అతనికి ఇద్దరు పిల్లలు. నాలుగేళ్ల క్రితం భార్య మరణించింది. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయి ఎప్పుడూ కూడా ఏదో ఆలోచనలో ఉంటూ గడిపేవాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి రెండు రోజుల క్రితం పొరుగువారితో గొడవపడ్డాడు. దాంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందామని భావించాడు. దీనిని ఫేస్‌బుక్‌లో లైవ్‌ స్ట్రీమ్‌ చేయాలని భావించాడు. లైవ్‌ ఆన్‌ చేసి చేతి మీద కత్తితో కోసుకున్నాడు. ఆ వ్యక్తి ప్రయత్నాన్ని అమెరికాలోని ఫేస్‌బుక్‌ కార్యాలయం అధికారులు గుర్తించారు. ఓ మేల్‌ ఫేస్‌బుక్‌ యూజర్‌ ఏదో అపాయకరమైన పని చేయబోతున్నాడని గుర్తించి వెంటనే ఢిల్లీ పోలీసులను అలర్ట్‌ చేశారు.

ఢిల్లీ పోలీసులు నోడల్‌ సైబర్‌ యూనిక్‌కు చెందిన సైబర్ ప్రివెన్షన్ అవేర్‌నెస్ అండ్ డిటెక్షన్ (సైపాడ్), సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ల మధ్య ఏర్పాటు చేసిన కోఆర్డినేషన్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ద్వారా ఫేస్‌బుక్‌ అధికారులు ఢిల్లీ పోలీసులను అలర్ట్‌ చేయగలిగారు. వెంటనే సైపాడ్‌ అధికారులు ఈ సమాచారాన్ని ఆ వ్యక్తి ఇంటికి సమీపంలో ఉన్న అత్యవసర వాహన ఇన్‌ఛార్జి ప్రొబేషనర్‌ ఎస్పై అమిత్‌ కుమార్‌కు అందజేశారు. దీంతో వారు ఆ అడ్రెస్‌కు వెళ్లి తలుపులు పగులగొట్టి చూశారు.

అప్పటికే రక్తపు మడుగులో ఉన్న ఆ వ్యక్తిని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించి.. ఆ తర్వాత ఏయిమ్స్‌ ట్రామా సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి స్థిరంగా ఉందని సైపాడ్ డీసీపీ అనైష్ రాయ్ తెలియజేశారు. తమకు ఫేస్ బుక్ కార్యాలయం నుంచి 12.50 నిమిషాలకు ఫోన్ వచ్చిందని.. ఆ వెంటనే స్పందించి గంటలోనే అతన్ని రక్షించామని ఆయన వెల్లడించారు.

Also Read:

SI Suicide: పని ఒత్తిడి.. స్టేషన్‌లోనే సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్న ఎస్ఐ

Golden Idol: మల్లన్న కలలో కనిపించాడంటూ పొలంలో తవ్వకాలు.. బంగారు విగ్రహం లభ్యం.. ఆపై

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?