Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Golden Idol: మల్లన్న కలలో కనిపించాడంటూ పొలంలో తవ్వకాలు.. బంగారు విగ్రహం లభ్యం.. ఆపై

Golden Idol: అప్పుడప్పుడు పొలం పనులు చేస్తున్న సమయంలో గుప్త నిధులు లభ్యమయ్యాయన్న వార్తలు వింటూనే ఉన్నాం.. అయితే తాజాగా ఓ రైతు తన పొలంలో...

Golden Idol: మల్లన్న కలలో కనిపించాడంటూ పొలంలో తవ్వకాలు.. బంగారు విగ్రహం లభ్యం.. ఆపై
Gold Idol
Follow us
Surya Kala

|

Updated on: Jun 05, 2021 | 8:16 PM

Golden Idol: అప్పుడప్పుడు పొలం పనులు చేస్తున్న సమయంలో గుప్త నిధులు లభ్యమయ్యాయన్న వార్తలు వింటూనే ఉన్నాం.. అయితే తాజాగా ఓ రైతు తన పొలంలో తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఓ బంగారు విగ్రహం లభ్యమైంది. దీనిని ఆ రైతు మల్లన్న స్వామి విగ్రహంగా భావించి ఇంటికి తీసుకెళ్లి పూజలు నిర్వహిస్తున్నాడు.ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విషయం బయటకు పొక్కడంతో అధికారుల దృష్టికి వెళ్ళింది. దీంతో వారు విచారణ చేపట్టి విగ్రహం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..

తెలంగాణ ములుగు జిల్లా కన్నాయిగూడం మండలం ముప్పనపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బిల్ల నారాయణ అనే వ్యక్తి గుప్త నిధుల కోసం బుట్టాయిగూడెంకు చెందిన మరో వ్యక్తితో కలిసి తన పొలంలో తవ్వకాలు జరిపాడు. ఈ తవ్వకాల్లో 500 గ్రాముల బంగారు మల్లన్న దేవుడి విగ్రహం దొరికింది. దీంతో అతడు దానిని తీసుకోని ఇంటికి వెళ్లి పూజలు చేయడం ప్రారంభించాడు.

అయితే నారాయణ పొలంలో జంతు బలి జరిగిన విషయం గ్రామస్థుల దృష్టికి వచ్చింది. వెంటనే నారాయణ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు గుప్త నిధుల తవ్విన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసులు పొలం యజమాని నారాయణ ఇంటికి వెళ్లి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. పోలీసులకు బంగారం విగ్రహం కనిపించడంతో నారాయణను విచారించారు. దీంతో నారాయణ అసలు విషయం బయట పెట్టాడు.

తనకు మే నెలలో తన పొలంలో మల్లన్న విగ్రహం ఉన్నట్లు కల వచ్చిందని.. అందుకనే మరో వ్యక్తి సహాయంతో మే 26 పొలంలో తవ్వకాలు జరిపానని చెప్పాడు. ఆ తవ్వకాల సమయంలో ఈ విగ్రహం దొరికిందని వివరించాడు. దీంతో విగ్రహాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నారాయణపై అతనికి సహకరించిన వ్యక్తిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: భారత దేశంలో అరుదైన మానసాదేవి ఆలయం.. నాగ, రాహుకేతు దోషాల పరిహారం కోసం పూజలు