AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Manasa Devi Temple: భారత దేశంలో అరుదైన మానసాదేవి ఆలయం.. ఇక్కడ నాగ, రాహుకేతు దోషాల పరిహారం కోసం పూజలు

Manasa Devi Temple: నాగ దోషం, రాహు కేతు దోషం ఉన్నవారు ఎక్కువగా శ్రీకాళ హస్తికి వెళ్లి పూజలు చేయించుకుంటారు అన్న సంగతి విదితమే.. అయితే పచ్చిమగోదావరి జిల్లా తణుకు సమీపంలోని అరుదైన మనసాదేవి ఆలయం కూడా రాహుకేతు పూజకు ప్రసిద్జి అన్న సంగతి కొంతమందికే తెలుసు.. ఈరోజు ముక్కామలలోని మనసాదేవి ఆలయం గురించి తెలుసుకుందాం.

Surya Kala
|

Updated on: Jun 05, 2021 | 7:30 PM

Share
ముక్కముల పురాణ ప్రసిద్ధి చెందిన గ్రామం. ఈ గ్రామాన్ని పురాణాలలో పలు పేర్లతో వ్యవహరించారు. ఈ గ్రామానికి గల పేర్లలో కొన్ని ....బ్రహ్మగుండం, కుమారక్షేత్రం, మునికోడు, ధర్మగుండం, త్రిపద్మక్షేత్రం . ఒకే కాడకు మూడు తామరపూలు వికసించటంతో పద్మక్షేత్రం (ముక్కామల) అనే పేరు వచ్చినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది.

1 / 6
మార్టేరు శ్రీధర స్వామి స్థాపిత కన్యకాపరమేశ్వరీశక్తిపీఠము ఉంది..ఇక్కడి దేవాలయం లోనే మానసదేవి కొలువైంది.. దేశంలోనే మానసదేవి ఆలయాలు చాల అరుదు..ప్రతీ నిత్యం విశేసమైన పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతాయి.

2 / 6
 గ్రామంలోని కేశవస్వామి, సోమేశ్వరస్వామి దేవాలయాలు 14 వ శతాబ్దంలోనివని శానసనలద్వారా తెలుస్తోంది. ఈ ఊరి గోదావరి రేవు బ్రహ్మగుండాల క్షేత్రంగా ప్రసిద్ధి. బ్రహ్మ ఇక్కడ యజ్ఞము చేశాడనీ, అందువలన ఇది బ్రహ్మగుండాల క్షేత్రం అయిందనీ అంటారు.

3 / 6
గోదావరి పుష్కరాల సమయంలో జనం విపరీతంగా ఇక్కడకు వచ్చి, గోదావరీ స్నానం చేసి తరిస్తారు.గ్రామ కంఠంలో రామాలయం, తూర్పు వీధిలో శివాలయం, పడమర వీధిలో విష్ణు ఆలయం ఉన్నాయి.శివునికి కార్తీక పున్నమి నాడు జ్వాలాతోరణం, శివరాత్రి నాడు తీర్థం ఉత్సవాలుగా జరుగుతాయి.

4 / 6
భీష్మ ఏకాదశికి విష్ణ్వాలయంలో ఉత్సవాలు జరుగుతాయి. ఏ ఉత్సవాల సమయంలోనైనా శివ, కేశవులు పల్లకీలలో ఊరి వీధులలో ఊరేగి గృహస్తుల పూజలను అందుకుంటారు.

5 / 6
నాగ దోషం,రాహు కేతు దోషం ఉన్నవాళ్లు ఇక్కడ ప్రత్యేకంగా పూజలు,అభిషేకాలు చేయించుకుంటారు. ఆలయంలో చాలా దేవత విగ్రహాలు కొలువయి ఉన్నాయి. మనసాదేవి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లంటే.. తణుకు నుండి వెళ్లాల్సి ఉంటుంది. తణుకు నుంచి 10 కిమి దూరం లో కొలువై ఉంది.

6 / 6