Red sandalwood Seized: ఆగని కలప అక్రమ రవాణా.. పది ఎర్రచందనం డంప్‌లను ఛేదించిన టాస్క్ ఫోర్స్..

దట్టమైన అడవులు స్మగ్లర్ల గొడ్డలి పెట్టుకు నేలకొరిగి పోతున్నాయి. ఒక్కప్పుడు ఎంతో దట్టంగా కనిపించిన అడవులు మైదాన ప్రాంతాలుగా మారిపోతున్నాయి.

Red sandalwood Seized: ఆగని కలప అక్రమ రవాణా.. పది ఎర్రచందనం డంప్‌లను ఛేదించిన టాస్క్ ఫోర్స్..
Red Sandalwood Logs Seized
Follow us

|

Updated on: Jun 05, 2021 | 8:46 PM

Red sandalwood logs: దట్టమైన అడవులు స్మగ్లర్ల గొడ్డలి పెట్టుకు నేలకొరిగి పోతున్నాయి. ఒక్కప్పుడు ఎంతో దట్టంగా కనిపించిన అడవులు మైదాన ప్రాంతాలుగా మారిపోతున్నాయి. అడవుల రక్షణకు వివిధ రకాలు చర్యలు తీసుకుంటున్న స్మగ్లర్లకు అక్రమదందాకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది. ముల్తానీల ముప్పు తప్పిన సరిహద్దు అడవుల్లో కలప రవాణాకు అడ్డుకట్టపడడం లేదు.

నాగలాపురం సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచి కలప డంప్‌ను ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ పట్టకుంది. గంగమ్మ కోన వద్ద యూకలిప్టస్ ట్రీ ప్లాంటేషన్ దాటిన తరువాత ఉన్న అటవీ ప్రాంతంలో దాదాపు పది చోట్ల డంప్ చేసి ఉంచిన 101 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం రేంజ్ డీఐజీ కాంతి రాణా టాటా ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ కు అందిన సమాచారంతో ప్రత్యేక బృందాలు నాగలాపురం వద్ద ఉన్న జంబుకేశ్వరపురం అడవిలోని గంగమ్మ కోన గుట్టలల్లో జెబికె పురం ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు.

శనివారం ఉదయం కొండగుట్టల్లోని అటవీ ప్రాంతంలో పది చోట్ల 101 ఎర్రచందనం దుంగలను డంప్ చేసి పెట్టినట్లు గుర్తించారు. స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను రవాణా చేయడానికి సిద్ధంగా ఉంచుకున్నారని అటవీ అధికారులు తెలిపారు. వీటిని టాస్క్ ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా కనుగొని స్వాధీనం చేసుకున్నారన్నారు. కాగా, ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. అసలు స్మగ్లర్ల కోసం వేట మొదలుపెట్టారు.

Read Also… Telangana Corona Cases: తెలంగాణలో 2,070 పాజిటివ్ కేసులు నమోదు.. 18 మంది మృతి..

రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..
ముఖేష్ అంబానీతో పెళ్లికి నీతా పెట్టిన కండీషన్ ఏంటో తెలుసా.?
ముఖేష్ అంబానీతో పెళ్లికి నీతా పెట్టిన కండీషన్ ఏంటో తెలుసా.?
కిడ్నీలు లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉండాలా.. ఈ ఫుడ్స్ తప్పక తినాల్సిందే
కిడ్నీలు లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉండాలా.. ఈ ఫుడ్స్ తప్పక తినాల్సిందే