e-Filing: ఇకపై పన్ను చెల్లింపులు ఈజీ.. 7 నుంచి ‘ఈ-ఫైలింగ్’ పోర్టల్ సేవలు ప్రారంభం
Income Tax Department e-filing portal: ఆదాయపు పన్ను శాఖ మార్పులకు శ్రీకారం చుట్టింది. పన్ను చెల్లింపులు మరింత సులభతరం అయ్యేలా
Income Tax Department e-filing portal: ఆదాయపు పన్ను శాఖ మార్పులకు శ్రీకారం చుట్టింది. పన్ను చెల్లింపులు మరింత సులభతరం అయ్యేలా ప్రణాళికను రూపొందించింది. ఇకపై మరింత సరళంగా పన్నుల ప్రాసెస్ జరిగేలా కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను (www.incometax.gov.in) జూన్ 7న (సోమవారం) ప్రారంభిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. రిఫండ్‌లు త్వరితంగా జారీ అయ్యేందుకు వీలుగా ఐటీ రిటర్న్‌లను తక్షణమే అమలు జరిగే విధంగా ఈ కొత్త e-Filing పోర్టల్ అనుసంధానమై వుంటుందని పేర్కొంది. తదుపరి మొబైల్ యాప్‌ను కూడా విడుదల చేస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
దీంతోపాటు కొత్త టాక్స్ పేమెంట్ సిస్టమ్ జూన్ 18న మొదలవుతుందని సీబీడీటీ పేర్కొంది. కొత్త పోర్టల్ ఫీచర్లను వివరిస్తూ ఇంటరాక్షన్లు, అప్‌లోడ్‌లు, పెండింగ్ యాక్షన్లు ఒకే డ్యాష్ బోర్డుపై కన్పిస్తాయని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ఐటీఆర్‌లు పలు దశలు (ఆదాయపు పన్ను రిటర్న్‌లు) సమయాత్తం చేసే సాఫ్ట్‌వేర్ ఉచితంగా లభిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం మూడు దశలు ఉండగా.. త్వరలో మరికొన్ని ఐటీఆర్‌లు ప్రిపేర్ చేసే సాఫ్ట్‌వేర్‌ను అందిస్తామని తెలిపింది. దీని ద్వారా పన్ను చెల్లింపులలో ఎలాంటి గందరగోళం లేకుండా సులభంగా ప్రాసెస్ జరగనుంది.
Also Read: