Fake News: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు… జాగ్రత్త‌! ఫేక్ న్యూస్ స‌ర్క్యులేట్ చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు..

Fake News: సోష‌ల్ మీడియా విస్తృతి పెరిగిన‌ప్ప‌టి నుంచి స‌మాచార మార్పిడిలో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌చ్చాయి. ప్ర‌పంచంలో ఏ మూల‌న ఏం జ‌రిగినా వెంట‌నే స్మార్ట్ ఫోన్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నాయి....

Fake News: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు... జాగ్రత్త‌! ఫేక్ న్యూస్ స‌ర్క్యులేట్ చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు..
Fake News In Whatsapp
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 06, 2021 | 8:20 AM

Fake News: సోష‌ల్ మీడియా విస్తృతి పెరిగిన‌ప్ప‌టి నుంచి స‌మాచార మార్పిడిలో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌చ్చాయి. ప్ర‌పంచంలో ఏ మూల‌న ఏం జ‌రిగినా వెంట‌నే స్మార్ట్ ఫోన్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నాయి. వాట్సాప్‌, ఫేస్‌బుక్ ఇలా ఏ సోష‌ల్ మీడియా సైట్లో చూసినా స‌మాచారం బాగా వ్యాప్తి చెందుతున్నాయి. అయితే ఇది బాగానే ఉన్నా.. ఈ స‌మ‌యంలోనే ఫేక్ న్యూస్ కూడా విస్తృతంగా స‌ర్క్యులేట్ అవుతోంది. ముందూ వెన‌కా చూసుకోకుండా వార్త‌ల‌ను సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు. అయితే ఇలాంటి ఫేక్ వార్త‌ల‌ను వ్యాప్తి చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తున్నారు పోలీసులు. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ సిటీ పోలీస్ క‌మిషన‌ర్ అంజ‌నీ కుమార్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. త‌మ గ్రూప్‌ల‌లో నిర్ధారించుకోకుండా ఫేక్ వార్త‌ల‌ను పోస్ట్ చేస్తే క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తేల్చి చెప్పారు.

కొండాపూర్‌లో పోలీస్ ఆఫీస‌ర్‌పై దాడి చేశార‌ని..

కొండాపూర్‌లో ఓ పోలీస్ ఆఫీస‌ర్‌పై కొంద‌రు వ్య‌క్తులు దాడి చేసినట్లున్న వీడియో గ‌త నెల 28న సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్‌గా మారింది. హైద‌రాబాద్‌లోని కొండాపూర్‌లో ఈ సంఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు స‌ద‌రు వార్త స‌ర్క్యూలేట్ అయ్యింది. అయితే ఆ సంఘ‌ట‌న గతేడాది అక్టోబ‌ర్‌లో జ‌రిగింద‌ని, అది కూడా కొండాపూర్‌లో కాద‌ని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఇక లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తున్నాడ‌ని పోలీస్ ఆఫీస‌ర్ కూర‌గాయ‌ల వ్యాపారిపై దాడి చేస్తున్న‌ట్లు ఉన్న వీడియోపై మియాపూర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో కేసు న‌మోదైంది. దీనిపై సైబ‌ర్ క్రైమ్ వింగ్‌లోనూ కేసు న‌మోదు చేశారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతోన్న నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న ఫేక్ న్యూస్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

Also Read: Petrol And Diesel Price: మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు.. దేశ వ్యాప్తంగా ఆదివారం ఇంధ‌న ధ‌ర‌లు ఇలా ఉన్నాయి..

Facebook alerts Delhi Police: ఆ యూజర్ చనిపోతున్నాడు.. అమెరికా నుంచి ఫేస్‌బుక్ అలెర్ట్.. ఆ తర్వాత..

Horoscope Today: ఆ రాశుల వారు విలువైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.. ఆదివారం రాశిఫలాలు ..