Suvendu Adhikari: బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారిపై కేసు నమోదు.. అతని సోదరుడిపై కూడా..
FIR against Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకుడు, శాసనసభాపక్ష నేత సువేందు అధికారిపై కేసు నమోదైంది. కంతి మున్సిపాలిటీ నుంచి లక్షల విలువైన వస్తు సామాగ్రిని దొంగతనం చేశారనే ఫిర్యాదు మేరకు
FIR against Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకుడు, శాసనసభాపక్ష నేత సువేందు అధికారిపై కేసు నమోదైంది. కంతి మున్సిపాలిటీ నుంచి లక్షల విలువైన వస్తు సామాగ్రిని దొంగతనం చేశారనే ఫిర్యాదు మేరకు సువేందు అధికారి, అతని సోదరుడు సౌమేందు అధికారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కంతి మునిసిపల్ అడ్మినిస్ట్రేటివ్ బోర్డ్ సభ్యుడు రత్నదీప్ మన్నా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కంతి పోలీసులు వెల్లడించారు. రత్నదీప్ మన్నా ఈ నెల 1న ఫిర్యాదు చేయగా.. ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. మే 29న సువేందు అధికారి, మాజీ కంతి మున్సిపాలిటీ చీఫ్ సౌమేందు అధికారి.. కంతి కార్యాలయ గోడౌన్‌లోకి బలవంతంగా, అక్రమంగా చొరబడి లక్షలు విలువచేసే సామాగ్రిని దోచుకెళ్లారని అని మన్నా తెలిపారు. దొంగతనంలో బీజేపీ నేతలు కేంద్ర సాయుధ బలగాలను సైతం ఉపయోగించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
FIR filed against BJP leader Suvendu Adhikari and his brother in Kanthi, West Bengal for stealing relief material from Municipality based on TMC’s complaint (05.06)
— ANI (@ANI) June 5, 2021
ఇదిలాఉంటే.. ఎన్నికల అనంతరం కూడా బెంగాల్‌లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార తృణముల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాగా.. నందిగ్రామ్‌లో సువేందు అధికారి.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై గెలుపొందిన విషయం తెలిసిందే.
Also Read: