Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake Oximeter Apps: అవ‌స‌రం మాటున ప్ర‌మాదం పొంచి జాగ్ర‌త్తా..! గూగుల్ ప్లే స్టోర్‌లో ఫేక్ ఆక్సీమీట‌ర్ యాప్స్‌..

Fake Oximeter Apps: క‌రోనా స‌క్షోభ‌స‌మ‌యంలో ఆక్సీమీట‌ర్‌ల వినియోగం బాగా పెరిగింది. క‌రోనా సెకండ్ వేవ్ స‌మ‌యంలో చాలా మంది ఆక్సిజ‌న్ అంద‌క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే శ‌రీరంలో ఆక్సిజ‌న్...

Fake Oximeter Apps: అవ‌స‌రం మాటున ప్ర‌మాదం పొంచి జాగ్ర‌త్తా..! గూగుల్ ప్లే స్టోర్‌లో ఫేక్ ఆక్సీమీట‌ర్ యాప్స్‌..
Fake Oximeeter Apps
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 06, 2021 | 10:37 AM

Fake Oximeter Apps: క‌రోనా స‌క్షోభ‌స‌మ‌యంలో ఆక్సీమీట‌ర్‌ల వినియోగం బాగా పెరిగింది. క‌రోనా సెకండ్ వేవ్ స‌మ‌యంలో చాలా మంది ఆక్సిజ‌న్ అంద‌క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే శ‌రీరంలో ఆక్సిజ‌న్ స్థాయిల‌ను తెలుసుకునేందుకు ఆక్సీమీట‌ర్ల‌ను ఉప‌యోగిస్తున్నారు. అయితే ఈ స‌మ‌యంలో స్మార్ట్ ఫోన్ యాప్‌ల ద్వారా ఆక్సిజ‌న్ స్థాయిలు తెలుసుకోవ‌చ్చ‌ని కొన్నియాప్‌లు గూగుల్ ప్లేస్టోర్‌లో హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. అయితే ప్ర‌జ‌ల అవ‌స‌రం మాటున్న కొన్ని యాప్స్ ఎంచ‌క్కా వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని కొట్టేస్తున్నట్లు సైబ‌ర్ నిపుణులు గుర్తించారు. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న కొన్ని న‌కిలీ ఆక్సీమీట‌ర్ యాప్‌ల‌ను ఇన్‌స్టాల్ చేసిన‌ప్పుడు.. జీపీఎస్‌, మెమరీ కార్డు, బ్లూటూత్‌లను వాడుకోవటానికి అనుమతి అడుగుతాయి. గ్యాలరీ, కాంటాక్టులు, సేవ్‌ అయిన డాక్యుమెంట్లను వాడుకునే అవ‌కాశాలున్నాయి. దీంతో బ్యాంకు వివ‌రానుల కూడా దొంగ‌లించ‌వచ్చ‌ని సైబ‌ర్ నిపుణులు చెబుతున్నారు. ఇక మరీ ముఖ్యంగా ఫింగ‌ర్ ప్రింట్‌ను త‌స్క‌రించే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. కాబ‌ట్టి ఆక్సీమీట‌ర్‌కు సంబంధించిన యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకునే క్ర‌మంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచిస్తున్నారు. ప్ర‌ముఖ కంప్యూట‌ర్ సెక్యూరిటీ సంస్థ క్విక్ హీల్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం కొన్ని ఫేక్ ఆక్సీమీట‌ర్ యాప్‌లు యూజ‌ర్ల బ్యాంక్ వివ‌రాల‌ను త‌స్క‌రిస్తున్నట్లు గుర్తించారు. సోష‌ల్ మీడియా, మెసేజ్‌ల ద్వారా వ‌చ్చి యాప్‌ల‌కు సంబంధించిన లింక్‌ల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో క్లిక్ చేయ‌కూడ‌ద‌ని సూచిస్తున్నారు. ఇక యాప్ వివ‌ర‌ణ‌లో ఉండే ఇంగ్లిష్ ముఖ్యంగా గ్రామర్‌, స్పెల్లింగ్‌ల‌ను ప‌రిశీలించాల‌ని చెబుతున్నారు. స‌హ‌జంగా ఫేక్ యాప్‌ల‌లో భాష‌లో త‌ప్పులు ఉంటాయ‌నేది సైబ‌ర్ నిపుణుల అభిప్రాయం.

Also Read: Drugs Seized: శంషాబాద్ విమానాశ్రయంలో రూ.53 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. మహిళ అరెస్ట్

ప్లీజ్ ! నన్ను, మా కుటుంబాన్ని ఆదుకోరూ ? త్రిపురలో బాలిక అభ్యర్థన….స్పందించిన సీఎం బిప్లబ్ దేబ్

India Coronavirus: దేశంలో భారీగా తగ్గిన కరోనా మరణాలు.. కేసులు ఎన్ని నమోదయ్యాయంటే..?

రైల్లోంచి చెత్తను విసిరేసిన ఉద్యోగి.. నెటిజన్లు సీరియస్
రైల్లోంచి చెత్తను విసిరేసిన ఉద్యోగి.. నెటిజన్లు సీరియస్
రూ 7 కోట్ల డైమండ్ చెవి దిద్దులు కొట్టేసి.. గుట్టుగా మింగేసి ??
రూ 7 కోట్ల డైమండ్ చెవి దిద్దులు కొట్టేసి.. గుట్టుగా మింగేసి ??
ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. బెస్ట్ హార్రర్ ఫిల్మ్‌!
ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. బెస్ట్ హార్రర్ ఫిల్మ్‌!
హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి.
పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి.
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా..?
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా..?
పెళ్లయిన రెండో రోజే షాకిచ్చిన వధువు.. లబోదిబోమన్నవరుడు
పెళ్లయిన రెండో రోజే షాకిచ్చిన వధువు.. లబోదిబోమన్నవరుడు
ఐడియా అదిరింది.. కరెంట్‌ అక్కర్లేని ఏసీ.. చల్ల చల్లని కూల్ కూల్
ఐడియా అదిరింది.. కరెంట్‌ అక్కర్లేని ఏసీ.. చల్ల చల్లని కూల్ కూల్