ప్లీజ్ ! నన్ను, మా కుటుంబాన్ని ఆదుకోరూ ? త్రిపురలో బాలిక అభ్యర్థన….స్పందించిన సీఎం బిప్లబ్ దేబ్

త్రిపురలో ఎనిమిదో తరగతి చదువుతున్న బర్గా దాస్ అనే 14 ఏళ్ళ బాలిక చేసిన అభ్యర్థనకు ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్ చలించిపోయారు. తన తల్లికి కోవిద్ పాజిటివ్ అని, తమ నలుగురు కుటుంబ సభ్యులు చిన్న గది వంటి ఇంట్లో...

  • Publish Date - 10:09 am, Sun, 6 June 21 Edited By: Anil kumar poka
ప్లీజ్ ! నన్ను, మా కుటుంబాన్ని ఆదుకోరూ ? త్రిపురలో బాలిక అభ్యర్థన....స్పందించిన సీఎం బిప్లబ్ దేబ్
Girl Seeks Help Cm Responded In Tripura

త్రిపురలో ఎనిమిదో తరగతి చదువుతున్న బర్గా దాస్ అనే 14 ఏళ్ళ బాలిక చేసిన అభ్యర్థనకు ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్ చలించిపోయారు. తన తల్లికి కోవిద్ పాజిటివ్ అని, తమ నలుగురు కుటుంబ సభ్యులు చిన్న గది వంటి ఇంట్లో నివసిస్తున్నామని, తనకు చదువుకోవడానికి స్టడీ టేబుల్ లేదని ఆ చిన్నారి ఫేస్ బుక్ లో దీనంగా పోస్ట్ పెట్టింది. దయ చేసి సాయం చేసి ఆదుకోవాలంటూ కోరింది. దీంతో ఆయన తక్షణమే ఆ కుటుంబానికి అవసరమైన సహాయం చేయాలంటూ అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు బర్గా దాస్ ఇంటికి ఆగమేఘాల మీద గత శుక్రవారం స్టడీ టేబుల్, ఆమె తల్లికి అవసరమైన కోవిద్ మందులు,, ఇంకా ఫుడ్ పాకెట్లు అందాయి. అగర్తల శివారులోని ఆమె ఇంటికి అధికారుల బృందమొకటి చేరుకుని వీటిని అందజేసింది. ఇంకా ఏదైనా సాయం అవసరమైతే చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని ఆ బృంద సభ్యులు ఆమెకు తెలిపారు. ఆ బాలిక తండ్రి ఏదో చిన్న ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడని, చాలీచాలని జీతంతో నెట్టుకొస్తున్నాడని తెలిసింది. ఇంటిముందుకు వచ్చిన ఈ సాయాన్ని చూడగానే ఆయనకు ఆనందంతో నోట మాటరాలేదు. తన కూతురు ఫేస్ బుక్ లో చేసిన ఈ విజ్ఞప్తి గురించి ఆయనకు తెలియనే తెలియదట.. ఆయన ముఖ్యమంత్రికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఇక చిన్నారి బర్గా దాస్ సంతోషంతో పొంగిపోయింది. వెంటనే సీఎంకి ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది. కాగా ముఖ్యమంత్రి గతంలో కూడా ఇలాగే సాయం అవసరమైనవారిని ఎంతగానో ఆదుకున్నారని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Today Gold Rate, Silver Price Video: పసిడిప్రియులకు కాస్త ఊరట. గత కొద్దిరోజులుగా తగ్గుతూ పెరుగుతున్నా బంగారం ధరకు బ్రేక్.

కోయంబత్తూర్‌లోని వాల్పరైలో ఏనుగు బీభత్సం.. తేయాకు తోటపై విరుచుకుపడిన గజరాజు :Elephant viral video.

హిమాచల్ ప్రదేశ్ శివాలిక్ కొండల్లో కనిపించిన అరుదైన ,అతి విషపూరితమైన కింగ్ కోబ్రా : King Cobra Video

ఈ పిల్లి చేష్టలు చుస్తే నవ్వాపుకోలేరు..వేరే పిల్లిని పిలుస్తున్న యజమానిపై ఓ పిల్లి కోపం:Cat Viral Video