India Coronavirus: దేశంలో భారీగా తగ్గిన కరోనా మరణాలు.. కేసులు ఎన్ని నమోదయ్యాయంటే..?

India Covid-19 Updates: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. దీంతో కొన్ని రోజులుగా నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఉపశమనం కలిగించే విషయమేమిటంటే..

India Coronavirus: దేశంలో భారీగా తగ్గిన కరోనా మరణాలు.. కేసులు ఎన్ని నమోదయ్యాయంటే..?
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 06, 2021 | 9:46 AM

India Covid-19 Updates: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. దీంతో కొన్ని రోజులుగా నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఉపశమనం కలిగించే విషయమేమిటంటే.. ప్రస్తుతం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పడుతూ వస్తోంది. అయితే.. మరణాలు మాత్రం కొంచెం ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24గంటల్లో కేసులు, మరణాలు భారీగా తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా నిన్న కొత్తగా 1,14,460 కేసులు నమోదు కాగా.. ఈ వైరస్ కారణంగా 2,677 మంది మరణించారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,88,09,339 కి పెరగగా.. మరణాల సంఖ్య 3,46,759 కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

ఇదిలాఉంటే.. నిన్న ఈ మహమ్మారి నుంచి 1,89,232 బాధితులు కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 2,69,84,781 కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14,77,799 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా మొత్తం 23,13,22,417 వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కాగా.. నిన్న దేశవ్యాప్తంగా 20,36,311 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. వీటితో కలిపి ఇప్పటివరకూ 36,47,46,522 నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.

Also Read:

కేరళ నర్సులకు ఢిల్లీ ఆస్పత్రి ఆదేశాలపై వివాదం.. మండిపడుతున్న మలయాళీలు

Chinese Virologist: అక్కడి నుంచే కరోనా వైరస్ వచ్చింది.. ఫౌచీకి తెలుసంటున్న చైనీస్ వైరాలజిస్ట్

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే