Petrol And Diesel Price: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. దేశ వ్యాప్తంగా ఆదివారం ఇంధన ధరలు ఇలా ఉన్నాయి..
Petrol And Diesel Price: సామాన్యుడికి పెట్రోల్ బంక్‌కు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజురోజుకీ పెరిగిపోతున్న ఇంధన ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. దేశంలో ఇంధన ధరలు...
Petrol And Diesel Price: సామాన్యుడికి పెట్రోల్ బంక్‌కు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజురోజుకీ పెరిగిపోతున్న ఇంధన ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. దేశంలో ఇంధన ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. ప్రతి రోజూ ఎంతో కొంత పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆదివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల కనిపించింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈరోజు ఇంధన ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..
* దేశ రాజధాని ఢిల్లీలో:
లీటర్ పెట్రోల్ ధర రూ. 94.76 (శనివారం రూ. 94.49 ) లీటర్ డీజిల్ ధర రూ. 85.66 (శనివారం రూ. 85.38 )
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో:
లీటర్ పెట్రోల్ ధర రూ. 100.98 (శనివారం రూ. 100.72 ) లీటర్ డీజిల్ ధర రూ. 92.99 (శనివారం రూ. 92.69 )
* చెన్నైలో ఇంధన ధరలు:
లీటర్ పెట్రోల్ ధర రూ. 96.23 (శనివారం రూ. 96.08 ) లీటర్ డీజిల్ ధర రూ. 90.38 (శనివారం రూ. 90.21 )
* బెంగళూరులో పెట్రోల్, డీజిల్ ధరలు:
లీటర్ పెట్రోల్ ధర రూ. 97.92 (శనివారం రూ. 97.64 ) లీటర్ డీజిల్ ధర రూ. 90.81 (శనివారం రూ. 90.51 )
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..
* హైదరాబాద్‌లో ధరలు ఇలా ఉన్నాయి:
లీటర్ పెట్రోల్ ధర రూ. 98.48 (శనివారం రూ. 98.20 ) లీటర్ డీజిల్ ధర రూ. 93.38 (శనివారం రూ. 93.08 )
* వరంగల్‌లో ఇంధన ధరల వివరాలు:
లీటర్ పెట్రోల్ ధర రూ. 98.03 (శనివారం రూ. 97.75 ) లీటర్ డీజిల్ ధర రూ. 92.95 (శనివారం రూ. 92.64 )
* విజయవాడలో:
లీటర్ పెట్రోల్ ధర రూ. 100.89 (శనివారం రూ. 100.73 ) లీటర్ డీజిల్ ధర రూ. 95.19 (శనివారం రూ. 95 )
* విశాఖపట్నంలో ఇంధన ధరల వివరాలు:
లీటర్ పెట్రోల్ ధర రూ. 99.90 (శనివారం రూ. 100.09 ) లీటర్ డీజిల్ ధర రూ. 94.23 (శనివారం రూ. 94.36 )
Also Read: Horoscope Today: ఆ రాశుల వారు విలువైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.. ఆదివారం రాశిఫలాలు ..
SI Suicide: పని ఒత్తిడి.. స్టేషన్‌లోనే సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్న ఎస్ఐ