ఆ బీజేపీ ఎమ్మెల్యే కారణంగా నాకు కూతురు పుట్టింది.. కావాలంటే

ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యేపై ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేసింది. తనపై రెండేళ్లుగా లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని.. ఈ క్రమంలో ఎమ్మెల్యే కారణంగా తనకు కూతురు కూడా జన్మించిందని..

  • Tv9 Telugu
  • Publish Date - 11:12 am, Sun, 16 August 20
ఆ బీజేపీ ఎమ్మెల్యే కారణంగా నాకు కూతురు పుట్టింది.. కావాలంటే

ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యేపై ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేసింది. తనపై రెండేళ్లుగా లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని.. ఈ క్రమంలో ఎమ్మెల్యే కారణంగా తనకు కూతురు కూడా జన్మించిందని తెలిపింది. తనకు పుట్టిన కూతురి డీఎన్‌ఏను ఎమ్మెల్యే డీఎన్‌ఏతో చెక్ చేయాలని డిమాండ్ చేసింది. అయితే ఈ ఆరోపణలపై సదరు ఎమ్మెల్యే భార్య ఖండించింది. అంతేకాదు డెహ్రాడూన్‌లోని నెహ్రూ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఆరోపణలు చేసిన మహిళపై ఫిర్యాదు చేసింది. సదరు మహిళతో పాటుగా మరో నలుగురు వ్యక్తుల పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఇదిలావుంటే.. ఆరోపణలు చేసిన మహిళ.. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే తనపై రెండేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నారని వీడియో పోస్ట్ చేసింది. అంతేకాదు ఎమ్మెల్యే కారణంగానే తనకు కూతురు జన్మించిందని.. కావాలంటే డీఎస్ఏ చెక్ చేయాలని డిమాండ్ చేసింది.

Read More :

ధోనీ, రైనా రిటైర్మెంట్‌లపై యూపీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు