ధోనీ, రైనా రిటైర్మెంట్‌లపై యూపీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
భారత క్రికెటర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ధోని ఒకరు. అయితే శనివారం..

భారత క్రికెటర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ధోని ఒకరు. అయితే శనివారం సాయంత్రం ధోనీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో కోట్ల మంది అభిమానులు షాక్‌కు గురయ్యారు. అయితే ధోని రిటైర్మెంట్ ప్రకటించిన కాసేపటికే మరో ఆల్ రైండర్ సురేష్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వీరిద్దరి రిటైర్మెంట్ ప్రకటనలపై యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ స్పందించారు.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ధోని.. అత్యంత ప్రతిభావంతుడని.. ధోని రిటైర్మెంట్‌తో ఓ శకం ముగిసిందని అన్నారు. ధోనీ దేశానికి ఎంతో గౌరవం తెచ్చారని.. ముఖ్యంగా దేశ యువతకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. ధోని కొత్త ఇన్నింగ్స్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు యోగీ ట్వీట్ చేశారు. ఇక సురేష్ రైనా కూడా గొప్ప ఆటగాడని.. ఆల్ రౌండర్‌గా తన ప్రతిభ చాటుకున్నాడని అన్నారు. యూపీ రత్నం అంటూ సీఎం యోగీ కొనియాడారు.
विलक्षण प्रतिभा संपन्न, अद्भुत नायक, धैर्य के प्रतिमान, भारतीय क्रिकेट जगत के जाज्वल्यमान नक्षत्र श्री @msdhoni जी द्वारा अंतरराष्ट्रीय क्रिकेट से संन्यास की घोषणा एक युग की समाप्ति है।
आपने सदैव भारत का मान बढ़ाया है, आप युवाओं की प्रेरणा हैं।
नवीन पारी के लिए मेरी शुभेच्छाएं!
— Yogi Adityanath (@myogiadityanath) August 15, 2020
भारतीय क्रिकेट को अपनी आभा से ऊष्मित करने वाले महान खिलाड़ी, उत्तर प्रदेश के रत्न श्री @ImRaina जी का खेल जीवन उपलब्धियों से पूरित रहा है।
आपका धैर्य-आपका समर्पण भाव प्रेरणास्पद है। उत्तर प्रदेश सहित पूरे देश को आप पर गर्व है।
जीवन की नई पारी के लिए मंगलकामनाएं!
— Yogi Adityanath (@myogiadityanath) August 15, 2020
Read More :