IPL 2025: ఉప్పల్‌లో హైవోల్టేజ్ మ్యాచ్.. ప్లే ఆఫ్స్ రేసులో నిలిచేదెవరు!
ఐపీఎల్ 2025 వేదికగా ఇవాళ హై వోల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది. ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్ (MI), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య బిగ్ ఫైట్ జరుగుతుంది. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఈ మ్యాచ్ గెలవడం రెండు జట్లకు ఎంతో కీలకం.

ఉప్పల్ వేదికగా ఇవాళ ముంబై ఇండియన్స్ (MI), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఈ మ్యాచ్ గెలవడం రెండు జట్లకు ఎంతో కీలకం. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన SRH కేవలం 2 మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించి ఐపీఎల్ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఇక ముంబైతో మ్యాచ్ ఓడితే SRH ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్నట్టే అని తెలుస్తోంది. మరోవైపు ఈ సీజన్‌లో మొదట భారీ పరాజయాలు ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్ ఇప్పుడు కాస్తా రానిస్తోంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన ముంబై 4 మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతోంది.
అయితే ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఈ మ్యాచ్ గెలిస్తే ముంబైకి ప్లే ఆఫ్స్ చేరేందుకు అవకాశాలు మెరుగవుతాయి. కాబట్టి ఈ రెండు జట్లు కచ్చితంగా ఈ మ్యాచ్‌ను గెలిచి ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు దూకుడు మీద ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ జట్టు విజయం సాధించి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




