Indian Railways: రూ.20 కోసం రైల్వే శాఖపై పోరాటం.. 22 ఏళ్ల తర్వాత విజయం.. సంచలన తీర్పునిచ్చిన కోర్టు

Indian Railways: అప్పుడప్పుడు ఆశ్చర్యపోయే ఘటనలు చోటు చేసుకుంటాయి. దేశంలో డబ్బును దోచుకునేవాళ్లు పెరిగిపోతున్నారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బు వృధా అయ్యిందంటే..

Indian Railways: రూ.20 కోసం రైల్వే శాఖపై పోరాటం.. 22 ఏళ్ల తర్వాత విజయం.. సంచలన తీర్పునిచ్చిన కోర్టు
Indian Railway
Follow us
Subhash Goud

|

Updated on: Aug 13, 2022 | 7:53 AM

Indian Railways: అప్పుడప్పుడు ఆశ్చర్యపోయే ఘటనలు చోటు చేసుకుంటాయి. దేశంలో డబ్బును దోచుకునేవాళ్లు పెరిగిపోతున్నారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బు వృధా అయ్యిందంటే బాధేస్తుంది. సాధారణంగా రైల్వే స్టేషన్‌లోనూ, షాపింగ్‌ మాల్స్‌లోనూ ఏ వస్తువైనా కొనాలంటే అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎమ్మార్పీ రేట్లకే విక్రయించాలన్న రూల్‌ తుంగలో తొక్కి అధిక ధరలకు విక్రయిస్తుంటారు. అయినా జనాలు అవేమి పెద్దగా పట్టించుకోకుండా కొనుగోలు చేస్తూనే ఉంటారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా రైల్వేశాఖపైనే కేసు వేశాడు. ఎందుకంటే టికెట్‌ మీద అసలు ధర కంటే రూ.20 ఎక్కువగా తీసుకున్నారని పోరాటం చేశాడు. ఈ విషయంలో తుంగనాథ్‌ చతుర్వేద అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. 22 సంవత్సరాల తర్వాత తనకు అనుకూలమైన తీర్పు వచ్చింది. చివరికి రైల్వేశాఖదే తప్పని నిరూపించి శభాష్‌ అనిపించుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.. 1999లో ఉత్తరప్రదేశ్‌లోని మధుర కంటోన్మెంట్‌ రైల్వే స్టేషన్‌లో తుంగనాథ్‌ చతుర్వేది అనే ప్రయాణికుడు మధుర నుంచి మొరాదాబాద్‌కు వెళ్లేందుకు రెండు టికెట్లను తీసుకున్నాడు. అయితే టికెట్‌ అసలు ధర కంటే రూ.20 ఎక్కువగా వసూలు చేశాడు. ఒక్కోటికెట్‌ ధర రూ.35 ఉండగా, రెండు టికెట్లకు కలిపి రూ.70 కాగా, అందుకు సదరు ప్రయాణికుడు రూ.100 ఇవ్వగా, కేవలం రూ.10 తిరిగి ఇచ్చాడు ఆ రైల్వే క్లర్క్‌. ఈ టికెట్లపై రూ.20 వరకు ఛార్జీ వేశాడు. ఇలా ఎందుకు ఎక్కువగా తీసుకుంటున్నారని తుంగనాథ్‌ క్లర్క్‌ను ప్రశ్నించగా, సదరు ఉద్యోగి ఇంతే తీసుకుంటాను.. మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకొమ్మని బదులిచ్చాడు.

కానీ చతుర్వేది ఈ విషయాన్ని ఇంతటితో వదిలివేయకుండా గోరఖ్‌పూర్‌ నార్త్‌ ఈస్ట్‌ రైల్వేపై, టికెట్లు ఇచ్చే సదరు ఉద్యోగిపై మధురలోని వినియోగదారుల కోర్టులో కేసు వేశాడు. ఇప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ కేసుకు సంబంధించి చతుర్వేది చాలా సార్లు కోర్టుకు హాజరయ్యారు. ఇప్పుడు ఆయన వయసు 66 సంవత్సరాలు. దీనిపై సుదీర్ఘంగా పోరాటం కొనసాగించారు. ఈ కేసును రైల్వే శాఖ కొట్టివేయాలని ప్రయత్నించింది. కానీ రైల్వేల మీద ఫిర్యాదులను రైల్వే ట్రైబ్యునల్‌కు పంపించాలి. కానీ వినియోగదారుల కోర్టుకు పంపరాదని రైల్వేశాఖ తెలిపింది. కానీ తుంగనాథ్‌ చతుర్వేది ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తన పోరాటం కొనసాగించారు.

ఇవి కూడా చదవండి

22 ఏళ్ల తర్వాత తీర్పు:

ఈ కేసులో 22 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఇచ్చింది. రైల్వే శాఖ రూ.15వేలను చతుర్వేదికి జరిమానాగా చెల్లించాలని తీర్పునిచ్చింది. ఆయన వద్ద అదనంగా వసూలు చేసిన రూ.20లకు 1999 నుంచి 2022 వరకు ఏడాదికి 12 శాతం వడ్డీ చెల్లించాలని రైల్వేశాఖకు కోర్టు ఆదేశించింది.

తన పోరాటానికి ఈ పరిహారం చాలా తక్కువ: చతుర్వేది

తాను ఇన్నేళ్లపాటు పోరాటం చేసినందుకు కోర్టు తీర్పు వచ్చి వచ్చే పరిహారం చాలా తక్కువ అని తుంగనాథ్‌ చతుర్వేది అన్నారు. నేను చేసిన పోరాటం నా ఒక్కరి గురించి కాదు.. ఇలాంటి పరిస్థితి అందరికి రావచ్చు. ఎందుకంటే రైలులో సామాన్యులు ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. వారి నుంచి ఇలా అధికంగా ఛార్జ్‌ వసూలు చేస్తే వాళ్ల పరిస్థితి ఏంటని, అందుకే తాను ఇన్నేళ్లుగా పోరాటం సాగించానని చెప్పుకొచ్చాడు. తాను చేసిన పోరాటం ప్రజలకు ఉపయోగపడేదేనని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి