Narendra Modi: నేడు కామన్ వెల్త్ గేమ్స్ విజేతలతో ముచ్చటించనున్న ప్రధాని మోదీ.. కొత్త సెల్ఫీ కోసం ఎదురుచూస్తున్నానన్న తెలంగాణ బిడ్డ..

బర్మింగ్ హామ్ లో జరిగిన కావన్ వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలో

Narendra Modi: నేడు కామన్ వెల్త్ గేమ్స్ విజేతలతో ముచ్చటించనున్న ప్రధాని మోదీ.. కొత్త సెల్ఫీ కోసం ఎదురుచూస్తున్నానన్న తెలంగాణ బిడ్డ..
Modi
Follow us
Amarnadh Daneti

|

Updated on: Aug 13, 2022 | 7:03 AM

Narendra Modi: బర్మింగ్ హామ్ లో జరిగిన కావన్ వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలో కామన్ వెల్త్ విజేతలతో ముచ్చటిస్తారు. ఇటీవల ముగిసిన కామన్ వెల్త్ క్రీడల్లో 22 బంగారు, 16 రజత, 23 కాంస్య పతకాలతో మొత్తం 61 పతకాలను సాధించిన భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పటికే పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ వేదికగా అభినందించారు. కాగా.. ఏదైనా ముఖ్యమైన ఈవెంట్లలో విజయం సాధించిన భారత క్రీడాకారులను మరింత ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజేతలను కలిసి..ముచ్చటించడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో టోక్యో ఒలింపిక్స్ లో విజయం సాధించిన భారత క్రీడాకారులను ప్రధానిమంత్రి నరేంద్రమోదీ సమావేవమైన విషయం తెలిసిందే.

ఇలా ఉండగా కామన్ వెల్త్ క్రీడల్లో పాల్గొన్న భారత సాయుధ దళాల ఆటగాళ్లతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం సమవేశమయ్యారు. ఈసందర్భంగా ఆటగాళ్ల ప్రదర్శనను కేంద్రమంత్రి కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడానికి తానే ఎంతో ఉత్సహంతో ఎదురుచూస్తున్నాని తెలంగాణలోని నిజామాబాద్ కు చెందిన భారత బాక్సర్ నిఖిత్ జరీన్ తెలిపారు. బర్మింగ్ హోమ్ లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో నిఖిత్ జరీన్ బంగారు పతకం సాధించింది. గతంలో ప్రధాని మోదీతో సెల్ఫీ తీసుకున్నానని..అయితే కొత్తగా మరొకటి కావాలంటూ ఓ వార్తాసంస్థతో నిఖిత్ జరీన్ పేర్కొంది. గతంలో టీషర్టు పై ఆటో గ్రాఫ్ తీసుకున్నానని.. ఇప్పుడు బాక్సింగ్ గ్లోవ్స్ లో తీసుకుంటానని తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే