Shocking: నిద్రలోనే ప్రాణాలొదిలిన తల్లిదండ్రులు.. వారి మధ్యలో ఉన్న 4 నెలల చిన్నారి మాత్రం..
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. రాత్రి నిద్రపోయిన దంపతులు.. తెల్లారి చూసేసరికి ప్రాణాలు కోల్పోయారు. వారిద్దరి మధ్యలో ఉన్న 4 నెలల చిన్నారి మాత్రం ప్రాణాలు
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. రాత్రి నిద్రపోయిన దంపతులు.. తెల్లారి చూసేసరికి ప్రాణాలు కోల్పోయారు. వారిద్దరి మధ్యలో ఉన్న 4 నెలల చిన్నారి మాత్రం ప్రాణాలు దక్కించుకుంది. ఇంతకీ ఏం జరిగింది? వారెలా చనిపోయారు? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సంభాల్ జిల్లా కేంద్రానికి చెందిన సలామ్(25), మేషార్ జహాన్(23) దంపతులు. వీరికి నాలుగు నెలల బిడ్డ కూడా ఉంది. వీరు తమ బిడ్డతో కలిసి శనివారం రాత్రి ఇంట్లోని బెడ్‌రూమ్‌లో నిద్రపోయారు. అయితే, ఇంట్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. గ్యాస్ హీటర్ ఆన్ చేసి పడుకున్నారు. అదే వారి ప్రాణాలను బలిగొంది.
మరుసటి రోజు ఉదయం తెల్లారినా వీరిద్దరూ గదిలోంచి బయటకు రాకపోవడంతో మిగతా కుటుంబ సభ్యులు గమనించారు. అప్పటికే దారుణం జరిగిపోయింది. దంపతులిద్దరు సలామ్, మేషార్ జహాన్ ప్రాణాలు కోల్పోగా.. 4 నెలల చిన్నారి మాత్రం ప్రాణాలతో ఉండి అపస్మాకర స్థితిలోకి చేరింది. దాంతో అలర్ట్ అయిన కుటుంబ సభ్యులు చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. భార్యభర్తల మృతిపై పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పరిశీలించారు. హీటర్ గ్యాస్‌తో ఊపిరాడక వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాగా, ఇలాంటి ఘటనలు గతంలో కూడా చాలా జరిగాయని పోలీసులు చెబుతున్నారు. ఇంట్లో గ్యాస్ హీటర్లతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
గ్యాస్ హీటర్లు ప్రమాదం..
కొన్ని అసురిక్షితమైన గ్యాస్ హీటర్లు కూడా ఉంటాయి. పని చేయని, సరిగా ఇన్‌స్టాల్ చేయని గ్యాస్ హీటర్ల కారణంగా గ్యాస్ లీకేజ్ జరుగుతుంది. తద్వారా మూసిఉన్న గదిలో ఆ గ్యాస్ అంతా వ్యాపిస్తుంది. ఇది గాలిలో విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ వాయువు స్థాయిలను పెంచుతుంది. తద్వారా వ్యక్తులు ప్రాణాలు కోల్పోతారు. అందుకే గ్యాస్ హీటర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..