దారుణం.. భార్య, ముగ్గురు పిల్లలపై తుపాకీతో కాల్పులు జరిపిన బీజేపీ నేత..!
ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌కు చెందిన బీజేపీ నాయకుడు తన భార్యను, ముగ్గురు పిల్లలపై తుపాకీతో కాల్చులు జరిపాడు. ఈ సంఘటనలో, అతని ఇద్దరు పిల్లలు మరణించగా, అతని భార్య, ఒక కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.

ఉత్తరప్రదేశ్‌లో ఒక హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. సహారన్‌పూర్‌లో ఒక బిజెపి నాయకుడు తన భార్య, ముగ్గురు పిల్లలను తుపాకీతో కాల్చలు జరిపాడు. ఈ సంఘటనలో ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందగా, భార్య, మరో కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అందరినీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పిల్లలిద్దరు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు ఇద్దరు పిల్లల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపారు. తల్లి, కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
నిందితుడు బిజెపి నాయకుడు యోగేష్ రోహిలాగా గుర్తించారు. సహారన్పూర్ జిల్లా కార్యవర్గ సభ్యుడుగా కొనసాగుతున్న యోగేష్ కొంత కాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే, ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులు ఎటువంటి ఖచ్చితమైన కారణాన్ని చెప్పలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సహారన్‌పూర్‌లోని గంగో ప్రాంతంలోని సంగతేడ గ్రామంలో నివసిస్తున్న బిజెపి నాయకుడు యోగేష్ రోహిలాగా చేసిన ఈ సంఘటన వార్త మొత్తం జిల్లాలో సంచలనం సృష్టించింది.
దారుణం జరిగిన వెంటనే, రూరల్ ఎస్పీ ఫోరెన్సిక్ బృందం, పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన తర్వాత, యోగేష్ రోహిలాగా స్వయంగా ఈ సంఘటన గురించి పొరుగువారికి తెలియజేసినట్లు చెబుతున్నారు. అతను తన భార్యను, ముగ్గురు పిల్లలను కాల్చి చంపానని చెప్పాడు. ఇది విన్న ఇరుగు పొరుగువారు షాక్ అయ్యారు. సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని చూసిన తరువాత, వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, యోగేష్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
పోలీసుల కథనం ప్రకారం, ఇంత పెద్ద సంఘటనకు సంబంధించిన ఖచ్చితమైన కారణాలు ఇంకా బయటపడలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మరణించగా, అతని భార్య, మరొక కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వారిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఈ సంఘటన వెనుక గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..