AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్‌.. ప్రధాని మోదీ సమాధానం ఇదే..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి ప్రధాని మోదీ అధ్యక్షుడు ట్రంప్‌నకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల ట్రంప్ సుంకాల తర్వాత, భారత్-అమెరికా మధ్య సంబంధాలలో కొంత ఉద్రిక్తత నెలకొంది. కానీ ఇప్పుడు ఈ ఉద్రిక్తత నెమ్మదిగా తొలగిపోతోంది. రెండు దేశాల మధ్య సంబంధాలు ఇప్పుడిప్పుడే తిరిగి గాడిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఫోన్ కాల్ ప్రాధాన్యత సంతరించుకుంది.

పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్‌.. ప్రధాని మోదీ సమాధానం ఇదే..!
Trump Wishes Pm Modi
Balaraju Goud
|

Updated on: Sep 17, 2025 | 7:28 AM

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి ప్రధాని మోదీ అధ్యక్షుడు ట్రంప్‌నకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “ధన్యవాదాలు నా మిత్రమా, నా 75వ పుట్టినరోజు సందర్భంగా మీ ఫోన్ కాల్, శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మీలాగే, నేను కూడా భారతదేశం-అమెరికా ప్రపంచ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం మీరు చేస్తున్న చొరవకు మేము మద్దతు ఇస్తున్నాము.’’ అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ట్రంప్ సుంకాల తర్వాత, భారత్-అమెరికా మధ్య సంబంధాలలో కొంత ఉద్రిక్తత నెలకొంది. కానీ ఇప్పుడు ఈ ఉద్రిక్తత నెమ్మదిగా తొలగిపోతోంది. రెండు దేశాల మధ్య సంబంధాలు ఇప్పుడిప్పుడే తిరిగి గాడిన పడుతున్నాయి. మంగళవారం (సెప్టెంబర్ 16) భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చించారు. చర్చల తర్వాత, దీనిపై భారతదేశ ప్రకటన కూడా వచ్చింది. ప్రతిదీ సానుకూలంగా ఉందని భారత్ సర్కార్ తెలిపింది. భారతదేశంతో ఒప్పందంలో ఎటువంటి అడ్డంకులు ఉండవని అటు అమెరికన్ చీఫ్ నెగోషియేటర్ బ్రెండన్ లించ్ హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో భారత అదనపు కార్యదర్శి రాజేష్ కూడా పాల్గొన్నారు. వాణిజ్య భాగస్వామ్యం, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సమావేశంలో చర్చించారు. మంగళవారం జరిగిన ఈ సమావేశంలో, నవంబర్ నాటికి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) మొదటి దశను పూర్తి చేయడంపై ఇరుపక్షాలు చర్చించాయి. దీంతో పాటు, ఆరవ రౌండ్ చర్చలు ఎప్పుడు ప్రారంభమవుతాయి. ఏ అంశాలపై చర్చించాలో కూడా నిర్ణయించారు.

భారతదేశంపై 50 శాతం సుంకం విధించిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. వాస్తవానికి, భారతదేశం రష్యా నుండి చమురు కొనుగోలు చేయకూడదని అమెరికా కోరుకుంది. ఇటీవల దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. భారతదేశం రష్యా నుండి చౌకగా చమురు కొనుగోలు చేసి దాని నుండి భారీ లాభాలను ఆర్జిస్తోందని అమెరికా చెప్పింది. దీనిపై భారతదేశం తీవ్రంగా స్పందించింది. దీని తర్వాత, రెండు దేశాల మధ్య కొంతకాలంగా ఉద్రిక్తతలు పెరిగాయి.

ఇదిలావుంటే, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన 75వ పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఉంటారు. ఈ సమయంలో, ఆయన దేశంలోని మొట్టమొదటి పీఎం మిత్రా పార్క్‌కు శంకుస్థాపన చేసి, ‘సేవా పఖ్వాడా’ను ప్రారంభిస్తారు. ధార్‌లోని భైంసోలా గ్రామంలో ‘ఆరోగ్యకరమైన మహిళలు, సాధికారత కలిగిన కుటుంబం’ ప్రచారాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

తన సామాజిక వర్గంపై తొలిసారి నోరు విప్పిన నటి.. నెట్టింట చర్చ!
తన సామాజిక వర్గంపై తొలిసారి నోరు విప్పిన నటి.. నెట్టింట చర్చ!
23 ఏళ్లుగా ఇండస్ట్రీలో తోపు.. చేసింది 7 సినిమాలే..
23 ఏళ్లుగా ఇండస్ట్రీలో తోపు.. చేసింది 7 సినిమాలే..
అవమానాల నుంచి 'దురంధర్' గర్జన వరకు.. ఆదిత్య ధర్ కన్నీటి కథ
అవమానాల నుంచి 'దురంధర్' గర్జన వరకు.. ఆదిత్య ధర్ కన్నీటి కథ
Video: యాషెస్ స్నికో వివాదంపై పెదవి విప్పిన అలెక్స్ కేరీ
Video: యాషెస్ స్నికో వివాదంపై పెదవి విప్పిన అలెక్స్ కేరీ
13 సెకన్లలో ఈ రెండు చిత్రాల మధ్య తేడాలను గుర్తిస్తే నువ్వే తోపు
13 సెకన్లలో ఈ రెండు చిత్రాల మధ్య తేడాలను గుర్తిస్తే నువ్వే తోపు
ఆ ఒక్క రీజన్‌తో 50 దాటినా పెళ్లి చేసుకోని ధురంధర్ మూవీ విలన్
ఆ ఒక్క రీజన్‌తో 50 దాటినా పెళ్లి చేసుకోని ధురంధర్ మూవీ విలన్
వచ్చే రెండు రోజులు చాలా జాగ్రత్త.! బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ..
వచ్చే రెండు రోజులు చాలా జాగ్రత్త.! బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ..
అంబానీ మావ మాస్టర్ స్ట్రోక్ చూస్తే మైండ్ పోతుంది
అంబానీ మావ మాస్టర్ స్ట్రోక్ చూస్తే మైండ్ పోతుంది
తగ్గని బంగారం జోరు.. మళ్లీ పెరిగిన ధరలు.. తులం ఎంటంటే?
తగ్గని బంగారం జోరు.. మళ్లీ పెరిగిన ధరలు.. తులం ఎంటంటే?
ఓవర్ నైట్‌లో స్వ్కాడ్ మార్చిన గంభీర్.. డేంజరస్ ఆల్‌రౌండర్ ఎంట్రీ
ఓవర్ నైట్‌లో స్వ్కాడ్ మార్చిన గంభీర్.. డేంజరస్ ఆల్‌రౌండర్ ఎంట్రీ