AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP MLC Elections: యూపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి.. ఎమ్మెల్సీ ఆఫర్ తిరస్కరించిన ప్రముఖ కవి

UP MLC Elections 2023: యూపీ ఎమ్మెల్సీ సీటుకు కుమార్ విశ్వాస్‌ ప్రముఖంగా వినిపించింది. అయితే పార్టీ నేతల ఆఫర్‌ను ఆయన సున్నితంగా తిరస్కరించారు.

UP MLC Elections: యూపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి.. ఎమ్మెల్సీ ఆఫర్ తిరస్కరించిన ప్రముఖ కవి
Kumar Vishwas
Balaraju Goud
|

Updated on: Mar 20, 2023 | 3:17 PM

Share

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. యూపీ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో నామినేటెడ్ సభ్యుల పేర్లపై తర్జన భర్జనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ కవి కుమార్ విశ్వాస్‌కు బిజెపి ఎమ్మెల్సీ సీటును ఆఫర్ చేసింది. అయినప్పటికీ, అతను ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం. అయితే మరో ముగ్గురి పేర్లపై బీజేపీ నేతలు కుస్తీ పడుతున్నారు.

యూపీ ఎమ్మెల్సీ సీటుకు కుమార్ విశ్వాస్‌ ప్రముఖంగా వినిపించింది. అయితే పార్టీ నేతల ఆఫర్‌ను ఆయన సున్నితంగా తిరస్కరించారు. కుమార్ విశ్వాస్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పడం ద్వారా ఆ ప్రతిపాదనను అంగీకరించలేదని తెలుస్తోంది. ఆ తర్వాత ఇప్పుడు ఇతర పేర్లపై పార్టీలో చర్చ మొదలైంది. బిజెపి అభ్యర్థుల జాబితాలో మరికొంత మంది పేర్లు తెరపైకి వచ్చాయి. ఈసారి కొందరు ప్రాంతీయ అధ్యక్షులను శాసనమండలికి పంపే ఆలోచనలో పార్టీ ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా నృపేంద్ర మిశ్రా తనయుడు సాకేత్ మిశ్రా పేరును కూడా ప్యానెల్‌కు పంపారు. దీంతో పాటు బీజేపీకి చెందిన మరో ముగ్గురు ప్రాంతీయ అధ్యక్షుల పేర్లను ప్యానెల్‌ పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం పార్టీలో పలువురి పేర్లు చర్చనీయాంశమవుతున్నాయి. విశేషమేమిటంటే రాష్ట్రంలో చాలా కాలంగా ఐదు శాసనమండలి స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

ఇదిలావుంటే, డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేసిన యోగి ఆదిత్యానాథ్.. అధికారంపై పట్టుతో పాటు పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర పార్టీని మరింత బలోపేతానికి మంచి నాయకత్వం ఏర్పాటుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందుకే త్వరలో పూర్తి పార్టీ కమిటీల నియామకం ఉండే అవకాశముంది. ప్రస్తుతం యూపీ బిజెపి కొత్త విస్తరణకు సంబంధించి చర్చ జరుగుతోంది. ఆ తర్వాతే పార్టీ నామినేటెడ్ ఎమ్మెల్సీ సభ్యుల పేర్లను ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పార్టీ విస్తరణను హోలీకి ముందే ప్రకటించాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..