కోవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నప్పుడు రెమ్ డెసివిర్ వాడడం మంచిది కాదు, ఎయిమ్స్ డైరెక్టర్

కోవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నప్పుడు  అనవసరంగా రెమ్ డెసివిర్ మెడిసిన్ వాడడం మంచిది కాదని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా హెచ్చరించారు.

కోవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నప్పుడు రెమ్ డెసివిర్ వాడడం మంచిది కాదు, ఎయిమ్స్ డైరెక్టర్
Dr Randeep Guleria
Follow us

| Edited By: Phani CH

Updated on: Apr 25, 2021 | 8:12 PM

కోవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నప్పుడు  అనవసరంగా రెమ్ డెసివిర్ మెడిసిన్ వాడడం మంచిది కాదని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా హెచ్చరించారు. మైల్డ్ కేసుల్లో ఈ ఇంజెక్షన్ మంచి కన్నా హాని ఎక్కువగా చేస్తుందని అన్నారు. ఆక్సిజన్  సిలిండర్లను గానీ ఈ మెడిసిన్ ని గానీ ప్రజలు తమ ఇళ్లలో ఉంచుకోరాదని ఆయన సూచించారు. రెమ్ డెసివిర్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సాలిడారిటీ ట్రయల్ నెగెటివ్ స్టడీని చూపిందని ఆయన చెప్పారు. ఇది హాస్పిటలైజేషన్ ను తగ్గించజాలదని, అలాగే రోగుల ప్రాణాలను కూడా రక్షించజాలదని ఈ స్టడీ పేర్కొందన్నారు. కోవిడ్ మోడరేట్, సీవియర్ కేసుల్లో ఇది హాస్పిటలైజేషన్ ను తగ్గిస్తుందని అమెరికాలో జరిపిన అధ్యయనంలో తేలిందని గులేరియా వెల్లడించారు. ఏ ఏమైనా రెమ్ డెసివిర్ మెడిసిన్ ‘మ్యాజిక్ బుల్లెట్’ కాదు అని ఆయన స్పష్టం చేశారు. ఇళ్లలో స్వీయ నియంత్రణలో ఉన్నవారి ఆక్సిజన్ లెవెల్ 94 కి పైగా ఉన్నపుడు ఈ మందు అవసరం లేదని,  రోగి ఆక్సిజన్ లెవెల్  93 కన్నా తగ్గినప్పుడే హాస్పిటల్స్ లో ఈ మందు ఇస్తారని ఆయన వివరించారు.

కరోనా వైరస్ కేసులు పెరగడంతో చాలామంది ఈ రెమ్ డెసివిర్ మందు వైపు పరుగులు తీస్తున్నారు. ఇదే అదనని కేటుగాళ్లు దీన్ని బ్లాకులో అత్యధిక ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అసలు ఈ మందు వాడేటప్పుడు డాక్టర్ల సలహా తీసుకోవడం అత్యుత్తమం. కోవిడ్ లో కొన్ని రుగ్మతలకు మాత్రమే దీన్ని వాడుతారని నిపుణులు చెబుతున్నారు. అసలు ఇందులో నాణ్యత లేదని, ఇది సరిగా పని చేయదని అంటున్నవారు కూడా ఉన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం రూ.4,403 కోట్లు.. త్రైమాసికంలో ఏకంగా మూడు రెట్లు అధికంగా నికర లాభం

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఆక్సిజన్ మళ్లింపును ఆపండి, ప్రధానికి తమిళనాడు సీఎం పళనిస్వామి లేఖ