ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.4,403 కోట్లు.. త్రైమాసికంలో ఏకంగా మూడు రెట్లు అధికంగా నికర లాభం
ICICI Bank: దిగ్గజ ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐ లాభం గణనీయంగా పెరిగింది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2020-21 మార్చితో ముగిసిన త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలను...
Updated on: Apr 25, 2021 | 8:03 PM

ICICI Bank: దిగ్గజ ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐ లాభం గణనీయంగా పెరిగింది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2020-21 మార్చితో ముగిసిన త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికంలో స్టాండ్‌లోన్ ప్రాతిపదికన బ్యాంకు నికర లాభం ఏకంగా మూడింతలు పెరిగి రూ.4,403 కోట్లుగా నమోదైంది. త్రైమాసికంలో ఏకంగా మూడు రెట్లు అధికంగా నికర లాభాన్ని సాధించింది.

ICICI Bank Service Charges

కాగా, ఇదే సమయంలో బ్యాంక్ స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) 5.53 శాతం నుంచి 4.96 శాతానికి పడిపోయాయి. నికర ఎన్‌పీఏలు కూడా 1.41 శాతం నుంచి 1.41 శాతానికి తగ్గాయి. కాగా మొండి బకాయిలు, కంటిజెన్సీల కోసం చేసిన కేటాయింపులు కూడా రూ.5,967.44 కోట్ల నుంచి రూ.2,888.47 కోట్లకు తగ్గినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ వెల్లడించింది.

అలాగే కన్సాలిడేటెడ్ ప్రాతిపదిన మార్చి త్రైమాసికంలో బ్యాంక్ నికర ఆదాయం రూ.43,621 కోట్లుగా ఉండగా నికర లాభం రూ.4,881 కోట్లుగా ఉంది. ఇక నికర వడ్డీ మార్జిన్ 3.87 శాతం నుంచి 3.84 శాతానికి తగ్గిందని బ్యాంకు వెల్లడించింది. కరోనా సెకండ్‌వేవ్ కారణంగా భవిష్యత్తులో కొంత కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, వాటిని తట్టుకునే సామర్థ్యం ఉందని బ్యాంక్ పేర్కొంది.




