- Telugu News Photo Gallery Business photos Hero destini 125 scooter available with benefits worth rs 3000
Hero Destini: హీరో మోటోకార్ప్ బంపరాఫర్.. డెస్టిని 125 స్కూటర్‌పై తగ్గింపు.. అసలు ధర ఎంతంటే..!
Hero Destini 125 Scooter: స్కూటర్ కొనుగోలు చేయాలని ఆలోచించే వారికి శుభవార్త. ప్రముఖ టూవీలర్ల తయారీ కంపెనీ హీరోకు చెందిన స్కూటర్‌పై తగ్గింపు ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్ ..
Updated on: Apr 24, 2021 | 9:21 PM

Hero Destini 125 Scooter: స్కూటర్ కొనుగోలు చేయాలని ఆలోచించే వారికి శుభవార్త. ప్రముఖ టూవీలర్ల తయారీ కంపెనీ హీరోకు చెందిన స్కూటర్‌పై తగ్గింపు ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్ ఈనెలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

హీరో మోటోకార్ప్‌కు చెందిన డెస్టిని 125 స్కూటర్‌పై తగ్గింపు లభిస్తోంది. ఈ స్కూటర్‌పై రూ.3 వేల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. లాయల్టీ బోనస్ లేదా ఎక్స్చేంజ్ బోనస్ కింద ఈ తగ్గింపు లభిస్తోంది.

ఇందులో 125 సీసీ ఇంజిన్ ఉంటుంది. స్పీడ్ అలర్ట్, ట్రిప్ అనాలసిస్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, హీరో కనెక్ట్ ఫీచర్, హాలోజెన్ హడ్‌లైట్, బల్బ్ టైయిల్‌లైట్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

హీరో డెస్టిని 125 స్కూటర్ ధర రూ.69 వేల నుంచి ప్రారంభం అవుతుంది. గరిష్ట ధర రూ.74,500 వరకు ఉంది. ఇవి ఎక్స్‌షోరూమ్ ధరలు. స్కూటర్ ఫ్రంట్, రియర్ వీల్స్‌కు డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. స్కూటర్ బరువు 114 కేజీలు.




