AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

UPSC Recruitment 2021: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే వారికి శుభవార్త. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అసిస్టెంట్‌ ..

UPSC Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల
Subhash Goud
|

Updated on: Feb 27, 2021 | 6:50 PM

Share

UPSC Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే వివిధ రంగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా జారీ చేస్తోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రం ప్రభుత్వం పరిధిలోని వివిధ రంగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. తాజాగాకేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే వారికి శుభవార్త. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లాంటి పోస్టులను భర్తీ చేస్తోంది. మొత్తం 89 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 2021 మార్చి 18. ఈ నోటిఫికేషన్‌ మరిన్ని వివరాలను యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://www.upsc.gov.in/ లో తెలుసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు ఉద్యోగాల కోసం https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.

ఖాళీల వివరాలు ఇవే…

మొత్తం ఖాళీలు- 89

పబ్లిక్ ప్రాసిక్యూటర్- 43 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్- 26 అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ (సివిల్)- 10 ఎకనమిక్ ఆఫీసర్- 1 సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (బాలిస్టిక్స్)- 1 ప్రోగ్రామర్ గ్రేడ్ ఏ- 1 సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (బయాలజీ)- 2 సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (కెమిస్ట్రీ)- 2 సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (డాక్యుమెంట్స్)- 2 సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (లై డిటెక్షన్)- 1

దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ – 2021 మార్చి 19 అర్హత – వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వయస్సు- గరిష్టంగా 35 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీస్ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది. వేతనం- ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వ 7వ వేతన స్కేల్ వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజు- రూ.25. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఎలాంటి ఫీజు లేదు.

విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Online Recruitment applications (ORA) For Various Recruitment postsపైన క్లిక్‌ చేయాలి. అందులో వేర్వేరు పోస్టులకు వేర్వేరు లింక్స్ ఉంటాయి. దరఖాస్తు చేయాలనుకున్న పోస్టుకు సంబంధించిన Apply Now లింక్ క్లిక్ చేయాలి. ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

Also Read :

APSSDC Job Mela : ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 200 ఉద్యోగాల నియామకం .. అర్హులెవరంటే..!