Maharashtra Politics: మార్చి నాటికి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం.. సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణే

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి నాటికి మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పడిపోతుందని, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన అన్నారు.

Maharashtra Politics: మార్చి నాటికి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం.. సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణే
Narayan Rane
Follow us
KVD Varma

|

Updated on: Nov 26, 2021 | 3:24 PM

Maharashtra Politics: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి నాటికి మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పడిపోతుందని, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన అన్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తే మీరు ఆశించిన మార్పును చూస్తారని అన్నారు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న శివసేన ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ కూటమికి మహా వికాస్ అఘాడి అని పేరు పెట్టారు.

అది రహస్యం..

ఇది ఎలా జరుగుతుంది అనేది నాకు మాత్రమే తెలిసిన విషయం. అందుకే దీనిని ఇప్పుడు బయటకు తీయడం ఇష్టం లేదు అని నారాయణ రాణే చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా, ప్రభుత్వాన్ని దించాలన్నా కొన్ని విషయాలను గోప్యంగా ఉంచాలి. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ మార్చిలోగా మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ విషయం ఆయన నుంచి వచ్చింది. కాబట్టి ఇది నిజమని నిరూపించడానికి మేము కృషి చేస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారు.

ఉద్ధవ్ థాకరే గురించి నారాయణ రాణే మాట్లాడుతూ.. అతను తన ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు, కాబట్టి నేను వ్యాఖ్యానించదలుచుకోలేదు. కానీ సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇటీవల వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్నారు.

ఉద్ధవ్ ఠాక్రేపై కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు మహారాష్ట్ర పోలీసులు ఆగస్టు 24న అరెస్టు చేశారు. కొన్ని గంటల తర్జనభర్జన తర్వాత ఆయనకు అర్థరాత్రి బెయిల్ లభించింది. దీని తర్వాత మహారాష్ట్ర అంతటా శివసైనికులు తీవ్ర ప్రదర్శన చేశారు. రాణేపై పలు జిల్లాల్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. నాసిక్‌లోని బిజెపి కార్యాలయంపై కూడా రాళ్లు రువ్వారు. ముంబైలోని రాణే ఇంటి వెలుపల నిరసన తెలుపుతున్న శివసైనికులపై పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ నేపధ్యంలో నారాయణ రాణే వ్యాఖ్యలు మరోసారి మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

ఇవి కూడా చదవండి: Earth Quake: మిజోరంలో భూకంపం.. ఈశాన్య రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో కంపించిన భూమి

Social Media: సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపాల్సిందే.. సిఫార్సు చేసిన భారత పార్లమెంటరీ ప్యానెల్

WhatsApp: వాట్సప్ వినియోగదారులకు మరో అదిరిపోయే ఫీచర్.. ఇకపై వాటిని మీరే సొంతంగా చేసుకోవచ్చు!