Earth Quake: మిజోరంలో భూకంపం.. ఈశాన్య రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో కంపించిన భూమి

మిజోరం రాష్ట్రంలోని థెన్‌జాల్ నగరంలో ఈరోజు తెల్లవారుజామున (శుక్రవారం-నవంబర్ 26) ఉదయం 5.15 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది.

Earth Quake: మిజోరంలో భూకంపం.. ఈశాన్య రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో కంపించిన భూమి
Earthquake
Follow us

|

Updated on: Nov 26, 2021 | 3:09 PM

Earth Quake: మిజోరం రాష్ట్రంలోని థెన్‌జాల్ నగరంలో ఈరోజు తెల్లవారుజామున (శుక్రవారం-నవంబర్ 26) ఉదయం 5.15 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. త్రిపుర, మణిపూర్, అస్సాంతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో కూడా భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, శుక్రవారం ఉదయం ఇండో-మయన్మార్ సరిహద్దులో భూకంపం సంభవించింది. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌కు తూర్పున 183 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. ఉదయం 5.23 గంటలకు రెండో భూకంపం సంభవించినట్లు సమాచారం. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) కూడా ఈ సమాచారాన్ని తన వెబ్‌సైట్‌లో అందించింది. థెన్‌జాల్‌కు చెందిన ఒక వ్యక్తి ఈ వెబ్‌సైట్‌లో ఇది ఎక్కువ సమయం పాటు సాగిన భూకంప ప్రకంపనలలో ఒకటి అని రాశారు.

థెన్‌జాల్ నివాసి ఈఎంఎస్సి(EMSC) వెబ్‌సైట్‌లో ఇలాంటి ప్రకంపనలు ఎప్పుడూ అనుభవించలేదని రాశారు. నవంబర్ 20న గౌహతి, అస్సాంలోని ఇతర ప్రాంతాలలో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 1.12 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతున ఉన్నట్లు గుర్తించారు.

వారం క్రితం రాజస్థాన్‌లో భూకంపం..

జోధ్‌పూర్‌లోని భిన్మల్‌లో నవంబర్ 20 తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భీన్మల్‌కు ఈశాన్య దిశలో ఉంది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైంది. భూకంప తీవ్రత తక్కువగా ఉండడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

రిక్టర్ స్కేలుపై భూకంపం.. ప్రమాద తీవ్రత ఎలా ఉంటుందంటే..

  • రిక్టర్ స్కేల్ ప్రకారం, 2.0 మాగ్నిట్యూడ్ కంటే తక్కువ ప్రకంపనల సంఖ్య రోజుకు ఎనిమిది వేల వరకూ ఉంటాయి. ఇది మానవులకు అస్సలు తెలియదు.
  • 2.0 నుండి 2.9 తీవ్రతతో దాదాపు వెయ్యి ఆఫ్టర్‌షాక్‌లు ప్రతిరోజూ నమోదవుతాయి. అయితే ఇవి సాధారణంగా తెలిసే అవకాశం ఉండదు.
  • రిక్టర్ స్కేలుపై 3.0 నుండి 3.9 తీవ్రతతో ప్రకంపనలు సంవత్సరానికి 49,000 సార్లు నమోదు అవుతాయి. ఇవి తరచుగా మనకి తెలియదు.. కానీ, కొన్నిసార్లు అవి నష్టాన్ని కలిగిస్తాయి.
  • 4.0 నుండి 4.9 తీవ్రతతో భూకంపాలు సంవత్సరానికి 6200 సార్లు నమోదవుతాయి. ఈ భూకంపం కారణంగా ప్రకంపనలు సంభవిస్తాయి. వీటిని మనం గుర్తించగలుగుతాము. వీటి వలన కొన్నిసార్లు నష్టం కూడా జరుగుతుంది.
  • 5.0 నుండి 5.9 తీవ్రతతో సంభవించిన భూకంపం ఒక చిన్న ప్రాంతంలో హాని కలిగించే అవకాశం ఉంటుంది. ఇళ్లకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఇది సంవత్సరానికి 800 సార్లు ఏర్పడతాయి.
  • 6.0 నుండి 6.9 తీవ్రతతో భూకంపాలు సంవత్సరానికి 120 సార్లు నమోదు అవుతుంటాయి. 160 కిమీ వ్యాసార్థంలో చాలా ప్రమాదాన్ని కలిగిస్తాయి.
  • ఇంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు చాలా అరుదుగా వస్తాయి. అవి విపరీతమైన ప్రాణనష్టాన్ని కలిగిస్తాయి.

ఇవి కూడా చదవండి: Black Friday Sale: బ్లాక్ ఫ్రైడే సేల్ అంటే తెలుసా.. ఇది ఎక్కడ ప్రారంభమైంది.. భారతదేశంలో ఎప్పుడు వచ్చింది..

Ranveer Singh 83: కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ నుంచి ఎట్టకేలకు అప్‌డేట్‌ వచ్చేసింది.. ’83’ టీజర్‌ను చూశారా.?

5-Second Rule: కిందపడిన ఆహారాన్ని తీసుకోవడానికి సంకోచిస్తున్నారా..? మీ సందేహానికి ఇదే సమాదానం..!

నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..