Kishan Reddy: ఒమిక్రాన్ వ్యాప్తి.. ఈశాన్య రాష్ట్రాలకు కీలక సూచనలు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
Kishan Reddy: దేశంలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్ర కల్చర్ అండ్ టూరిజం మంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy: దేశంలో మరోసారి కరోనా వైరస్(Coronaviurs) విజృంభిస్తున్న నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల(North Eastern States) ప్రభుత్వాలకు కేంద్ర కల్చర్ అండ్ టూరిజం మంత్రి కిషన్ రెడ్డి(G.Kishan Reddy) కీలక సూచనలు చేశారు. భారత ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల(SOP) ప్రకారం కోవిడ్ ప్రోటోకాల్‌పై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ముఖ్యంగా RT-PCR పరీక్షలను వేగవంతం చేయడం, నాన్ సీరియస్ కేసుల కోసం హోమ్ ఐసోలేషన్‌పై దృష్టి పెట్టడం, టెలికన్సల్టేషన్ ప్లాట్‌ఫారమ్, ఈసంజీవని ద్వారా క్రమం తప్పకుండా పర్యవేక్షించాలన్నారు. వీలైనంత త్వరగా 100 శాతం వ్యాక్సినేషన్ కోసం కృషి చేయాలని సూచించారు. అలాగే 15-18 సంవత్సరాల మధ్య వయస్సు గల యుక్తవయస్కులకు టీకాలను వేగవంతం చేయాలన్నారు.
కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈశాన్య ప్రాంతంలోని ఎనిమిది రాష్ట్రాల (ఎన్‌ఈఆర్) సంసిద్ధతను పర్యవేక్షించేందుకు కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి (DoNER), సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అధ్యక్షతన వర్చువల్ విధానంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 8 ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య శాఖ మంత్రులు, సంబంధిత శాఖకు చెందిన సీనియర్ అధికారులు, ఇతర ముఖ్య అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి.. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గ దర్శకాల ప్రకారం కోవిడ్ ప్రోటోకాల్‌ను పక్కా అమలు చేయాలన్నారు. RT-PCR పరీక్షలను వేగవంతం చేయడం, లక్షణాలు తక్కువగా ఉన్న వారికి హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స అందించడం, టెలికన్సల్టేషన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా క్రమం తప్పకుండా పర్యవేక్షించడం చేయాలని రాష్ట్రాలకు సూచించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
రాష్ట్రాలలో ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన కోసం NESIDS పథకం, అత్యవసర కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజీ (ECRP-ఫేజ్-II) కింద రాష్ట్రాలకు కేటాయించిన నిధులను ఉపయోగించుకోవాలని ఈశాన్య రాష్ట్రాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. కోవిడ్-19 నిర్దిష్ట అవసరాలైన ఫేస్ మాస్క్, పీపీఈ కిట్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఆస్పత్రిలో బెడ్స్ సహా అన్ని మౌలిక వసతులను సంసిద్ధంగా ఉంచుకోవాలన్నారు. మీడియా, కమ్యూనికేషన్ సాధానాలను ఉపయోగించుకుని ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి, థర్డ్ వేవ్‌పై ప్రజలకు అవగాహన కల్పించి, అప్రమత్తం చేయాలని ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రమంత్రి దిశానిర్దేశం చేశారు. అవసరమైన చోట మైక్రో కంటోన్మెంట్ జోన్‌లు పెట్టాలని సూచించారు.
Today, chaired a meeting over VC with Health Ministers, Senior officials of North Eastern States to review #COVID19Vaccination Progress and Public Health Preparedness to combat #COVID19 in NE States.@MDoNER_India pic.twitter.com/wn02N4A06e
— G Kishan Reddy (@kishanreddybjp) January 12, 2022
Also read:
AP Politics: ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంలో స్మశాన రచ్చ.. తగ్గేదే లే అంటున్న కీలక నేతలు..
Telangana Cm Kcr: కేంద్రం చర్యల వెనుక భారీ కుట్ర.. నాగళ్లు ఎత్తాలంటూ రైతులకు సీఎం పిలుపు..!
Fake Numbers: రిపేర్ కోసం వారికి కాల్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త, ఇది ఒకసారి చూడండి..