AP Politics: ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంలో స్మశాన రచ్చ.. తగ్గేదే లే అంటున్న కీలక నేతలు..

AP Politics: అదో ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం.. దేశ, విదేశాల భక్తుల ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంత వాతావరణం ఉంటుంది.

AP Politics: ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంలో స్మశాన రచ్చ.. తగ్గేదే లే అంటున్న కీలక నేతలు..
Follow us

|

Updated on: Jan 12, 2022 | 6:27 PM

AP Politics: అదో ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం(Spiritual Center).. దేశ, విదేశాల భక్తుల(Devotees) ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంత వాతావరణం ఉంటుంది. సరిగ్గా ఇక్కడే ఇప్పుడు ఒక స్మశానం(Burail Ground) తీవ్ర వివాదస్పదంగా మారింది. ఆ స్మశానం చుట్టూనే ఇప్పుడు రాజకీయ(Politics) నాయకులు మాటల తూటాలు పేలుస్తున్నారు. నువ్వేంత అంటే నువ్వేంత అనుకోవడం కాదు.. ఎవరైనా అడ్డొస్తే తాట తీయండని అధికార పార్టీ ఎమ్మెల్యే బహిరంగ పిలుపునిస్తున్నారు. అసలేంటి ఆధ్యాత్మిక కేంద్రంలో ఇలాంటి స్మశాన రాజకీయాలు.. ఎందుకా వివాదం.. ఈ కథనంలో తెలుసుకుందాం..

పుట్టపర్తి… ప్రపంచ ఆధ్యాత్మిక పటంతో పాటు సేవా కార్యక్రమాల్లో ఒక ప్రత్యేక స్థానం ఉన్న ప్రాంతం. ఇక్కడ సాయిరాం అన్న నామం తప్ప మరేమి ఉండదు. నిత్యం దేశ విదేశాలకు చెందిన భక్తుల సాయి చింతనతో ప్రశాంతంగా ఉంటుంది. అందుకే పుట్టపర్తిని ప్రశాంతి గ్రామ్ అని కూడా ఉంటారు. కానీ ఇలాంటి ప్రశాంతమైన పుట్టపర్తిలో ఒక స్మశానం కేంద్రంగా అగ్గి రాజుకుంది. ఇక్కడి రాజకీయ నాయకులు పుట్టపర్తికున్న ప్రాధాన్యత మరచి రాజకీయ నిప్పురవ్వను రాజేశారు. కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఈ స్మశానంలో జరుగుతున్న ఫైట్ సీన్ లో పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఒక వైపు.. మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి సహా మిగిలిన పార్టీలన్నీ ఒక వైపు మారాయి.

ఇంతకీ వివాదం ఏంటంటే.. పుట్టపర్తిలో స్మశానం ఊరి నడిబొడ్డున ఉంది. అది కూడా కేవలం రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉంది. పుట్టపర్తి జనాభాకు ఇది ఏమాత్రం సరిపోవడం లేదు. అయితే ఇలాంటి చోట కొంత ఖాళీ స్థలం ఉండటంతో అక్కడ అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఇదిగో ఈ నిర్ణయమే ఇప్పుడు అగ్గి రాజేసింది.

ఇంత పెద్ద పట్టణానికి ఉన్నది ఒక్కటే స్మశాన వాటిక. అది కూడా కుచించుకోపోయింది. ఇప్పుడు అందులో హెల్త్ క్లీనిక్ అంటే ఎలా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అది కూడా స్మశానంలో ఆసుపత్రి ఎవరైనా నిర్మిస్తారా అని నిలదీస్తున్నారు. ఇదే అంశంపై పుట్టపర్తిలో రెండు వారాలుగా ఆందోళనలు కూడా చేస్తున్నారు. ఏకంగా బంద్ కు కూడా పిలుపునిచ్చారు. ఈ బంద్ కార్యక్రమానికి వెళ్తున్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ని అరెస్ట్ కూడా చేశారు. ప్రతిపక్షాలు ఈ స్థాయిలో వ్యతిరేకిస్తున్నా.. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాత్రం ఇక్కడ హెల్త్ సెంటర్ నిర్మించి తీరుతాం అంటున్నారు. దీనికి కొన్ని లాజిక్స్ కూడా చెబుతున్నారు. గతంలో 7ఎకరాలు ఉన్న స్మశానం.. టీడీపీ పాలనలో ఒక ఎకరానికి వచ్చిందన్నారు. ఇప్పుడు ప్రజల సౌకర్యార్థం ఆసుపత్రి కడితే.. వీరెవరు అడ్డుకోవడానికి అంటూ ప్రశ్నిస్తున్నారు. తాను సమాధానం చెప్పాల్సింది ప్రజలకు మాత్రమే అని, ఇలాంటి వెధవలకు కాదంటూ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. అంతే కాదు ‘‘హెల్త్ సెంటర్ పనులకు అడ్డొస్తే.. పిడి గుద్దులు కొట్టండి.. ఇటు వైపు రాకుండా తరిమికొట్టండి’’ అంటూ బహిరంగ వేదికలోనే తమ శ్రేణులకు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి.

ప్రస్తుతం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపాయి. మాజీ మంత్రి పల్లె కూడా దీనికి అదే స్థాయిలోనే రియాక్ట్ అయ్యారు. నియోజకవర్గంలోని పుట్టపర్తి, ఓబుళదేవర చెరువు, కొత్తచెరువు, నల్లమాడ మండలాలలో ఎంత భూములు కబ్జాల చేసింది చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడన్నారు. అవినీతి మచ్చలేని తనపై అసత్య ఆరోపణలు చేస్తారా అంటూ ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు. తనను విమర్శించే స్థాయి ఎమ్మెల్యేకి లేదంటే చురకలంటించారు పల్లె. బీజేపీ నాయకుల కూడా దీనిపై అదే స్థాయిలో స్పందించారు. కాషాయ దళంపై ఈగ వాలినా చూస్తూ ఊరుకునేది లేదని తెగేసి చెప్పారు. టచ్ చేస్తే పరిణామాలు వేరేగా ఉంటాయని హెచ్చరించారు.

ఇప్పుడు ఈ రగడ ఇంకో టర్న్ కూడా తీసుకుంది. కుటుంబ పెద్దల సమాధులు తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు సెంటిమెంట్ రాజేస్తుండటం వివాదం మరింత ముదిరేలా చేస్తున్నాయి. ఇలా ప్రశాతంగా ఉన్న ప్రశాంతి గ్రామ్ లో స్మశానం చుట్టూ రాజకీయ రగడ చేస్తూ రచ్చ చేస్తున్నాయి.. రాజకీయ పార్టీలు. మరి ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

Also read:

Telangana Cm Kcr: కేంద్రం చర్యల వెనుక భారీ కుట్ర.. నాగళ్లు ఎత్తాలంటూ రైతులకు సీఎం పిలుపు..!

Fake Numbers: రిపేర్ కోసం వారికి కాల్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త, ఇది ఒకసారి చూడండి..

Extra Marital Relationship: అక్షరం ముక్క రాదు కానీ.. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను..