Fake Numbers: రిపేర్ కోసం వారికి కాల్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త, ఇది ఒకసారి చూడండి..
Fake Numbers: కేటు గాళ్లు(Thieves) రోజు రోజుకి బాగా రాటు దేలుతున్నారు. పరిస్థితులకు తగ్గట్లుగా నయా ప్లాన్స్ వేసి జనాలకు కుచ్చుటోపి పెడుతున్నారు.
Fake Numbers: కేటు గాళ్లు(Thieves) రోజు రోజుకి బాగా రాటు దేలుతున్నారు. పరిస్థితులకు తగ్గట్లుగా నయా ప్లాన్స్ వేసి జనాలకు కుచ్చుటోపి పెడుతున్నారు. తాజాగా నేరగాళ్లు చేస్తున్న కొత్త తరహా మోసం(Cheating) వెలుగు చూసింది. అది చూసి అవాక్కవడం బాధితుల వంతు అయ్యింది. గూగుల్ ప్రకటనలు (Google Ads) చూసి తొందరపడటమే వారికి మీరిచ్చే అవకాశం. అవుతును.. టెక్నాలజీనీ వినియోగించుకుంటూ సరికొత్తగా దోపిడికీ తెర లేపారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. వాషింగ్ మెషీన్లు మరమ్మతులు చేస్తామంటూ కేటుగాళ్లు గూగుల్‌లో ప్రకటనలు ఇస్తారు. అందులో వారికి సంబంధించిన ఫోన్ నెంబర్లు పెడతారు. వాటిని విశ్వసించి ఎవరైనా కాల్ చేస్తే చాలు.. వారికి పండుగే ఇక.
వాషింగ్ మెషీన్ పాడైపోయిందంటూ ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించిన వారి ఇంటికి వెళ్లిన మోసగాళ్లు.. మరమ్మతుల పేరుతో మెషీన్‌లోని ఖరీదైన పార్టులను దొంగిలిస్తున్నారు. వాటి ప్లేస్‌లో తక్కువ కాలం నడిచే డమ్మీ పార్టులు వేస్తున్నారు. మళ్లీ పాడైపోతే కస్టమర్లు కాల్ చేస్తే ఫోన్లను స్విచాఫ్ చేస్తున్నారు మోసగాళ్లు. తాజాగా ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌లో వెలుగు చూశాయి. బాధితులు పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఖాకీలు. మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు పోలీసులు.
Also read:
Google Image: మీరు గూగుల్ నుంచి డౌన్‌లోడ్ చేసిన ఫోటోలు నకిలీవా..?నిజమైనవా..? గుర్తించడం ఎలా..?
AP Corona Cases: రోజు రోజుకు పెరుగుతున్న కోవిడ్ కేసులు.. గత 24 గంటల్లో..
Naga Chaitanya: ‘ఇద్దరి మంచికే అంటూ’ సమంతతో విడాకులపై నాగచైతన్య ఆసక్తికర కామెంట్స్..